Ambedkar Statue : ఆగమేఘాలపై అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం….-andhra pradesh government speedup dr br ambedkar statue construction in vijayawada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ambedkar Statue : ఆగమేఘాలపై అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం….

Ambedkar Statue : ఆగమేఘాలపై అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం….

HT Telugu Desk HT Telugu
Feb 17, 2023 12:41 PM IST

Ambedkar Statue విజయవాడ స్వరాజ్య మైదానంలో జరుగు తున్న అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీ లక్ష్మీ పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు అంబేద్కర్ కాంస్య విగ్రహ నిర్మాణ పనులు వేగం పెంచుతున్నట్లు చెప్పారు. అంబేద్కర్ విగ్రహ భాగాలన్నీ సిద్ధం అయ్యాయయని, విగ్రహం మొత్తం 13 భాగాలుగా తయారు చేసినట్లు చెప్పారు. అన్ని భాగాలను కలిపి జాగ్రత్తగా విగ్రహ నిర్మాణం చేయవలసి ఉందన్నారు. కారిడార్ మొత్తంలో గ్రానైట్ ఫుట్ ఫాత్, ల్యాండ్ స్కేపింగ్, కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తి కావలసి ఉందన్నారు. అనుకున్న సమయానికి అంబేద్కర్ స్మృతివనం, విగ్రహ నిర్మాణం పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని చెప్పారు.

విజయవాడలో అంబేడ్క్ భారీ విగ్రహ నిర్మాణం
విజయవాడలో అంబేడ్క్ భారీ విగ్రహ నిర్మాణం

Ambedkar Statue ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం వేగాన్ని పెంచారు. విజయవాడలో డా. బి.ఆర్. అంబేద్కర్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని పీఠంపై ఏర్పాటు చేసే పనులకు మంత్రులు ప్రారంభించారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డా. బి.ఆర్. అంబేద్కర్ స్మృతి వనం నిర్మాణ పనులను క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులైన బొత్స సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ, మేరుగ నాగార్జునలు పరిశీలించారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ. 300 కోట్లతో నగర నడిబొడ్డున 125 అడుగుల కాంస్య విగ్రహం ఏర్పాటు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుని మంత్రులు చెప్పారు. ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆలోచనలకూ అనుగుణంగా డా. బి.ఆర్. అంబేద్కర్‌కు సముచిత స్థానం కల్పించాలని భావించారని, ఇందులో భాగంగా ఎవ్వరూ అడగక పోయినా రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించడంతో పాటు సుందరీకరణ పనులు, లైబ్రరరీ, కన్వెన్షన్ హాల్, స్మృతి వనం ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ పనుల్లో ఎటువంటి లోపాలు లేకుండా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ తగు సూచనలు అందిస్తున్నారన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటికే రెండు పర్యాయాలు ఢిల్లీ వెళ్లి పరిశీలించివచ్చామని మంత్రి బొత్స చెప్పారు. 70 అడుగుల పేడస్టల్ నిర్మాణంపై 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. విగ్రహ ఏర్పాటు పనులను సర్వమత ప్రార్థనలతో ప్రారంభించామన్నారు.

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏప్రిల్ నాటికి ఏర్పాటు చేయనున్నారు.
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏప్రిల్ నాటికి ఏర్పాటు చేయనున్నారు.

విగ్రహానికి సంబంధించి షూ భాగాలను ఏర్పాటు చేస్తున్నామని దశల వారీగా భాగాల వారీగా విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతున్నాయని మంత్రి కొట్టు సత్యనారాయణ చెప్పారు. విజయవాడ నగర నడిబొడ్డున 19 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు లైబ్రరరీ, కన్వెన్షన్ హాల్, పార్క్ నిర్మిస్తున్నామని అన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా అంబేద్కర్ స్మృతి వనాన్ని తీర్చిదిద్దుతామని మంత్రి బొత్స అన్నారు.

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈప్రాజెక్ట్ నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి పలు దఫాలుగా సమీక్షించారని ఏప్రిల్ 14 నాటికి నిర్మాణ పనులు పూర్తి చేయాలనే ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా అన్ని శాఖల సమన్వయంతో పనులు పూర్తి చేస్తామన్నారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ను నిర్మిస్తున్నదన్నారు. 80 అడుగుల పీఠంపై 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని దీనిద్వారా భూమి నుండి విగ్రహం ఎత్తు మొత్తం 205 అడుగులు ఉంటుందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విగ్రహం ఏర్పాటు పనులను సర్వమత ప్రార్థనల ద్వారా ఈరోజు ప్రారంభించామని ఆదేవుని దయతో ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్ణీత సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.

రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ దేశాల్లో మన గౌరవం ఇనుమడింపచేసిన మహోన్నత వ్యక్తి డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున నిర్మించడం ఎంతో ప్రతిష్టాత్మక విషయం అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. కోట్లాది రూపాయల విలువైన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలనే ముఖ్యమంత్రి ఆలోచనలకూ అనుగుణంగా మనమందరం కలిసి పనిచేయాలన్నారు. ఇంజినీర్లు, శిల్పులు, అధికారులు విగ్రహ నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు ఆంధ్రుల అందరికీ గర్వకారణమని ఈ విషయంలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక గౌరవం దక్కుతుందన్నారు.

Whats_app_banner