AP DEECET Results : ఏపీ డీఈఈసెట్ రిజెల్ట్స్ విడుదల, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా!-andhra pradesh deecet 2023 24 results out rank card download ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Deecet Results : ఏపీ డీఈఈసెట్ రిజెల్ట్స్ విడుదల, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా!

AP DEECET Results : ఏపీ డీఈఈసెట్ రిజెల్ట్స్ విడుదల, ర్యాంక్ కార్డు డౌన్లోడ్ ఇలా!

Bandaru Satyaprasad HT Telugu
Jun 19, 2023 07:55 PM IST

AP DEECET Results : ఏపీ డీఈఈసెట్ ఫలితాలు విడుదల అయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.

ఏపీ డీఈఈసెట్ ఫలితాలు
ఏపీ డీఈఈసెట్ ఫలితాలు

AP DEECET Results : ఏపీ డీఈఈసెట్(AP DEECET- 2023) ఫలితాలు సోమవారం సాయంత్రం విడుదలయ్యాయి. రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నిర్వహించారు. ఈ నెల 12, 13 తేదీల్లో ఆన్‌లైన్‌లో జరిగిన ఈ పరీక్ష ఫలితాలను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. డీఈఈ సెట్‌ నోటిఫికేషన్‌లో తెలిపిన విధంగా.. మొదటి కౌన్సెలింగ్‌కు వెబ్‌ ఆప్షన్లను జూన్‌ 22 నుంచి 27 వరకు వరకు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అభ్యర్థులకు సీట్ల కేటాయింపు, ప్రొవిజనల్ లెటర్లను ఈ నెల 28 నుంచి 30 వరకు జారీ చేస్తారు. జులై 6 వరకు సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగనుంది. అభ్యర్థులు ఐడీ, పుట్టినతేదీలను ఎంటర్‌ చేసి వెబ్ సైట్ లో ర్యాంక్‌ కార్డు పొందొచ్చు.

Step I- అభ్యర్థులు AP DEECET 2023 (https://apdeecet.apcfss.in) అధికారిక పోర్టల్‌ని సందర్శించండి.

Step II- హోమ్‌పేజీలో, "Results"పై క్లిక్ చేయండి

Step III- అభ్యర్థులు స్క్రీన్‌పై ఫలితాల లాగిన్ పేజీని చూస్తారు.

Step IV- హాల్ టిక్కెట్ నంబర్‌, పుట్టిన తేదీతో లాగిన్ చేయాలి.

Step V- "రిజల్ట్స్ పొందండి" పై క్లిక్ చేయండి.

Step VI- మార్కులు/ఫలితాలు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

Step VII- అభ్యర్థులు మార్కులు, ఫలితాలను తనిఖీ చేయవచ్చు.

Step VIII- చివరగా, భవిష్యత్ అవసరాల కోసం ర్యాంక్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసి ప్రింట్ తీసుకోవాలి. కౌన్సెలింగ్ సమయంలో ర్యాంక్ కార్డు అవసరం.

ఇటీవల తెలంగాణ డీఈఈసెట్ ఫలితాలు విడుదల

డైట్ కాలేజీల్లో ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాలు ఇటీవల విడుదల అయ్యాయి. తెలుగు, ఇంగ్లీష్, ఉర్డూ మీడియం కాలేజీల వారీగా ఫ‌లితాల‌ను వెల్లడించారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం నిర్వహించిన డీఈఈ సెట్ -2023 ఫ‌లితాలను అధికారిక వెబ్ సైట్ deecet.cdse.telangana.gov.in లో చెక్ చేసుకోవచ్చని ప్రకటించారు. ఈ ఏడాది నిర్వహించిన ప్రవేశ పరీక్షలో చూస్తే... తెలుగు మీడియంలో 75.91 శాతం, ఇంగ్లీష్ మీడియంలో 84.72 శాతం, ఉర్దూ మీడియంలో 50.65 శాతం ఉత్తీర్ణత సాధించారు. త్వరలోనే కౌన్సిలింగ్ తేదీలు ఖరారు చేయనున్నారు. డీఈఈసెట్‌ 2023 ప్రవేశ పరీక్ష ద్వారా ప్రభుత్వ డైట్‌ కాలేజీతోపాటు, ప్రైవేట్‌ డీఐఈడీ కాలేజీల్లోని డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ (డీఈఐఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ (డీపీఎస్‌ఈ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.. ఇందుకోసం జూన్ 1న పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

Whats_app_banner