AP Jobs : కడప, నెల్లూరు, పల్నాడు ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!-amaravati news in telugu kadapa nellore palnadu r and b contract jobs full details ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Jobs : కడప, నెల్లూరు, పల్నాడు ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!

AP Jobs : కడప, నెల్లూరు, పల్నాడు ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు, పూర్తి వివరాలు ఇలా!

Bandaru Satyaprasad HT Telugu
Feb 20, 2024 08:10 PM IST

AP Jobs : కడప, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో ఆర్ అండ్ బీ శాఖలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వాచ్ మెన్, శానిటరీ వర్కర్, అటెండర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించారు.

ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు
ఆర్ అండ్ బీ ఒప్పంద ఉద్యోగాలు

AP Jobs : కడప, నెల్లూరు, పల్నాడు జిల్లాల్లో రోడ్లు, భవనాల శాఖలో(R&B Jobs) కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు. వైఎస్ఆర్ కడప జిల్లా(Kadapa Jobs)లో 24 పోస్టులు, నెల్లూరు జిల్లా(Nellore Jobs)లో 27 పోస్టులు, పల్నాడు జిల్లాలో 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ను సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌(ఆర్‌ అండ్‌ బి) కార్యాలయం, సర్కిల్‌ ఆఫీస్, మారుతి నగర్, కడప చిరునామాకు పోస్టు చేయాలి. నెల్లూరు ఆర్ అండ్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అప్లికేషన్లను ఆర్ అండి బీ సర్కిల్ ఆఫీసర్, నెల్లూరు జిల్లా, దర్గామిట్టా చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. పల్నాడు జిల్లా ఆర్ అండ్ బీ శాఖలో పోస్టులకు దరఖాస్తులను అభ్యర్థులు పల్నాడు ఆర్ అండ్ బీ ఇంజినీరింగ్ ఆఫీసర్, ప్రకాశ్ నగర్, పల్నాడు జిల్లా, నరసరావుపేట-522601 చిరునామా పంపించాల్సి ఉంటుంది. అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి. గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు మించకూడదు. నెల వేతనం రూ.15,000 చెల్లిస్తారు.

yearly horoscope entry point

కడప జిల్లా పోస్టులు- 24

  • వాచ్‌మెన్‌-06
  • శానిటరీ వర్కర్‌-08
  • అటెండర్‌-10

నెల్లూరు జిల్లా పోస్టులు- 27

  • వాచ్‌మెన్‌-09
  • శానిటరీ వర్కర్‌-09
  • అటెండర్‌–09

పల్నాడు జిల్లా పోస్టులు- 21

  • వాచ్‌మెన్‌-07
  • శానిటరీ వర్కర్‌-07
  • అటెండర్‌–07

పని అనుభవానికి మార్కులు

కడప జిల్లా ఆర్ అండ్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 22. అభ్యర్థుల దరఖాస్తులను ఈ నెల 23 నుంచి 26 తేదీల మధ్య పరీశీలిస్తారు. అభ్యర్థులు మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://kadapa.ap.gov.in/ సందర్శించవచ్చు. నెల్లూరు జిల్లా ఆర్ అండ్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 26 చివరి తేదీ. అభ్యర్థులు మరింత సమాచారం కోసం https://spsnellore.ap.gov.in/ వెబ్ సైట్ ను సందర్శించండి. పల్నాడు జిల్లాలో ఆర్ అండ్ బీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 2 చివరి తేదీ. అభ్యర్థులకు పని అనుభవాన్ని మార్కులు కేటాయిస్తారు. 0-2 ఏళ్ల పని అనుభవం ఉన్న వారికి 3 మార్కులు, 3-5 ఏళ్లు ఉన్న వారికి ఆరు మార్కులు, ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న వారికి 10 మార్కులు కేటాయిస్తారు. ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికేట్ కలిగిన వారికి 5 మార్కులు కేటాయిస్తారు. ఇద్దరు అంతకన్నా ఎక్కువ మందికి ఒకే మార్కులు వస్తే విద్యార్హత ఎక్కువ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

Whats_app_banner

సంబంధిత కథనం