Amaravati Farmers Plots : రాజధాని రైతులకు సీఆర్డీఏ మరో అవకాశం, ఈ-లాటరీలో ప్లాట్లు కేటాయింపు!
Amaravati Farmers Plots : అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ప్లాట్లు కేటాయిస్తున్నట్లు సీఆర్డీఏ ప్రకటన జారీ చేసింది. ఫిబ్రవరి 5, 6, 7, 8 తేదీల్లో రాజధాని ప్రాంత గ్రామాల రైతులకు ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయిస్తామని ప్రకటించింది.
Amaravati Farmers Plots : అమరావతి రాజధాని రైతులకు ఈ-లాటరీ ద్వారా ప్లాట్లను కేటాయించాలని సీఆర్డీఏ నిర్ణయించింది. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయించనుంది. అయితే ఇప్పటికే రెండు సార్లు సీఆర్డీఏ ప్రకటన జారీ చేయగా, రైతుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాజాగా మూడోసారి ఈ-లాటరీ నిర్వహించేందుకు ప్రకటన జారీ చేసింది. గ్రామాల వారీగా నివాస, వాణిజ్య స్థలాలు కేటాయించేందుకు సీఆర్డీఏ ప్రకటనలు చేస్తుంది. గత రెండు సార్లు రైతులు ఈ-లాటరీకి హాజరుకాకపోవడంతో ... మరో అవకాశం కల్పిస్తున్నట్టు సీఆర్డీఏ తెలిపింది.
మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయలేదు
అమరావతి ప్రాంతంలోని ఐనవోలు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు, అనంతవరం గ్రామాలకు ఫిబ్రవరి 5న ఈ-లాటరీ కింద ప్లాంట్లు కేటాయించనున్నారు. ఫిబ్రవరి 6న నిడమర్రు, కురగల్లు, నెక్కల్లు గ్రామాలకు, ఫిబ్రవరి 7న మందడం, వెలగపూడి, ఉద్దండరాయునిపాలెం, కొండమరాజపాలెం గ్రామాలకు, ఫిబ్రవరి 8న రాయపూడి, నవులూరు, లింగాయపాలెం, వెంకటపాలెం గ్రామాల రైతులకు ఈ-లాటరీ నిర్వహిస్తామని సీఆర్డీఏ ఓ ప్రకటనలో తెలిపింది. రైతులు ఆందోళన చెందుతున్నట్లు మాస్టర్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయలేదని సీఆర్డీఏ తెలిపింది. రాజధాని ప్రాంతంలోని 16 గ్రామాల రైతులకు లే-అవుట్ ప్లాన్లు అందుబాటులో ఉంచామని ప్రకటించారు.
సమస్యాత్మక ప్లాట్లు 2243గా గుర్తింపు
రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన వారిలో సమస్యాత్మక ప్లాట్లు పొందిన రైతులు సీఆర్డీఏకు గతంలో తమ అభ్యంతరాలు తెలిపారు. టీడీపీ హాయంలో అమరావతికి భూములిచ్చిన రైతుల్లో కొందరికి కేటాయించిన భూముల్లో నివాస, వాణిజ్య ప్లాట్లు వచ్చాయి. కానీ ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం రాజధాని నిర్మాణం, భూసేకరణ ముందుకు సాగలేదు. అయితే గతంలో భూములిచ్చిన రైతులు తమకు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించాలని రైతులు సీఆర్డీఏను కోరారు. ఇలాంటివి సమస్యాత్మకమైనవి 2,243 ప్లాట్లు ఉన్నట్లు సీఆర్డీఏ గుర్తించింది. ప్రభుత్వ ఆదేశాలతో ఇలాంటి ప్లాట్లు ఉన్న 679 మంది రైతులకు సీఆర్డీఏ రెండుసార్లు నోటీసులు పంపింది.
రైతులు అంగీకరిస్తే భూసేకరణ భూముల్లో ఉన్న ప్లాట్లను రద్దు చేసి మరోచోట ప్రత్యామ్నాయ ప్లాట్లను కేటాయిస్తామని తెలిపింది. అయితే వీరిలో 44 మంది రైతులు ప్రత్యామ్నాయ ప్లాట్లకు అంగీకారం తెలిపారు. దీంతో గత రెండు సార్లు ఈ-లాటరీ విధానం నిలిచిపోయింది. తాజాగా సీఆర్డీఏ మరోసారి ప్లాట్ల కేటాయింపునకు ప్రకటన చేసింది. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు విజయవాడలోన సీఆర్డీఏ కార్యాలయంలో ఈ-లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు అమరావతి రాజధాని అంశం సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది.
అమరావతి రైల్వే లైన్లకు రూ.1000
కేంద్ర మధ్యంతర బడ్జె్ట్ లో ఏపీకి కేటాయింపులు అంతంతమాత్రమేనని రాష్ట్ర వాసులు పెదవి విరుస్తున్నాయి. ఇక అమరావతి రైల్వే లైన్ కు కేంద్రం కేటాయింపు చూస్తూ ఆశ్చర్యపోతారు. రాజధాని అమరావతి నుంచి విజయవాడ, గుంటూరు నగరాలను కలిపేందుకు ప్రతిపాదించిన రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్రం రూ.1000 కేటాయించింది. మొత్తం రూ.2,679 కోట్ల ఖర్చు అయ్యే ఈ రైల్వే లైనుకు గత ఐదేళ్లలో రూ.2.20 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈసారి కేవలం రూ.1000 మాత్రం ఇస్తామని బడ్జె్ట్ లో ప్రకటించింది. దీంతో ఏపీకి కేంద్రం ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
సంబంధిత కథనం