Schools Holidays : ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్, సంక్రాంతి సెలవులు మరో 3 రోజులు పొడిగింపు
విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
ఏపీలో పాఠశాలలకు సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగించారు. జనవరి 22న స్కూల్స్ తిరిగి ఓపెన్ కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి నేపథ్యంలో జనవరి 18వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. అయితే ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజులు సెలవులు పొడిగిస్తూ జనవరి 22న పాఠశాలలు తెరుస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ తెలిపారు.
జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతో దేశవాప్తంగా పలు రాష్ట్రాలు జనవరి 22న స్కూల్స్, కాలేజీలకు సెలవులను ప్రకటించాయి. తెలుగు రాష్ట్రాలు కూడా జనవరి 22న స్కూళ్లకు సెలవు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 22న సెలవు ప్రకటిస్తే 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఏపీలో పాఠశాలలకు వరుసగా 13 రోజులు పాటు సెలవులు వచ్చాయి. తెలంగాణ సర్కార్ పాఠశాలలకు జనవరి 12 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది.
ఏపీ ప్రభుత్వ సాధారణ సెలవులు
- జనవరి 1-న్యూఇయర్ (సోమవారం)
- జనవరి 14- భోగి (ఆదివారం)
- జనవరి 15- సంక్రాంతి (సోమవారం)
- జనవరి 26- రిపబ్లిక్ డే(శుక్రవారం),
- మార్చి 8- మహాశివరాత్రి (శుక్రవారం),
- మార్చి 25- హోలీ (సోమవారం),
- మార్చి 29- గుడ్ ఫ్రైడే (శుక్రవారం),
- ఏప్రిల్ 5- బాబు జగ్జీవన్ రామ్ జయంతి (శుక్రవారం),
- ఏప్రిల్ 9 -ఉగాది (మంగళవారం),
- ఏప్రిల్ 11- ఈదుల్ ఫితర్ (రంజాన్)(గురువారం),
- ఏప్రిల్ 12- రంజాన్ మాసం (శుక్రవారం),
- ఏప్రిల్ 14 - బీఆర్ అంబేడ్కర్ జయంతి (ఆదివారం),
- ఏప్రిల్ 17- శ్రీరామనవమి (బుధవారం),
- జూన్ 17 -ఈదుల్ అజహా (బక్రీద్) (సోమవారం),
- జులై 17- మొహర్రం (బుధవారం),
- జులై 27- బోనాలు (సోమవారం),
- ఆగస్టు 15- స్వాంతంత్ర్యదినోత్సవం (గురువారం),
- ఆగస్టు 28- శ్రీకృష్ణాష్టమి (సోమవారం),
- సెప్టెంబర్ 7- వినాయకచవితి (శనివారం),
- సెప్టెంబర్ 16- ఈద్ మిలానుదీన్‌నబీ (సోమవారం),
- అక్టోబర్ 2- మహాత్మాగాంధీ జయంతి (బుధవారం),
- అక్టోబర్ 12 -విజయదశమి (శనివారం),
- అక్టోబర్ 13- విజయదశమి పర్వదినాలు (ఆదివారం),
- అక్టోబర్ 30 -దీపావళి (బుధవారం),
- సెప్టెంబర్ 15- కార్తీక పౌర్ణమి/గురునానక్ జయంతి (శుక్రవారం),
- డిసెంబర్ 25- క్రిస్మస్ (బుధవారం),
- డిసెంబర్ 26 క్రిస్మస్ పర్వదినాలు (గురువారం)