AP CMO : జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం అనుమానాలు- విచారణకు సీఎంవో ఆదేశం-amaravati gps gazette released without government consent ap cmo ordered inquiry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cmo : జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం అనుమానాలు- విచారణకు సీఎంవో ఆదేశం

AP CMO : జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం అనుమానాలు- విచారణకు సీఎంవో ఆదేశం

Bandaru Satyaprasad HT Telugu
Jul 17, 2024 08:45 PM IST

AP CMO : జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ పై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించడంతో సీఎంవో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులున్నారా? అనే కోణంలో సీఎంవో అధికారులు ఆరా తీస్తున్నారు.

జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం అనుమానాలు- విచారణకు సీఎంవో ఆదేశం
జీపీఎస్ జీవో, గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం అనుమానాలు- విచారణకు సీఎంవో ఆదేశం

AP CMO : ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటుతున్నా ఇంకా అధికారులు గాడిలో పడలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందుకు నిదర్శనం ప్రభుత్వ అనుమతి లేకుండానే జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ విడుదల అని భావిస్తున్నారు. ఈ విషయంపై సీఎంవో సీరియస్ గా ఉందని, ప్రభుత్వ అనుమతి లేకుండా జీవో, గెజిట్ ఎందుకు జారీ చేశారని సమాచారం సేకరిస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ ఉదంతంపై సీఎంవో అధికారులు విచారణ చేపట్టారు. ముఖ్యంగా ఆర్థికశాఖ, న్యాయ శాఖల్లో పనిచేస్తున్న అధికారుల్లో ఎవరు కారణమో దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతి కుమారి, న్యాయశాఖ సెక్షన్‌ అధికారి హరిప్రసాద్‌ రెడ్డి పాత్రపై సీఎంవో విచారణ చేస్తుంది. ఈ ఇద్దరు అధికారుల గత వ్యవహారాలపై ఆరా తీస్తుంది. ప్రభుత్వం మారినప్పుడు నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బిజినెస్ నిబంధనలు చెబుతున్నా... హడావుడిగా జీపీఎస్ జీవో జారీ, గెజిట్ నోటిఫికేషన్ జారీపై నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు గుర్తించారు. సీంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజున జీపీఎస్ జీవో జారీ అవ్వడం, సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ విడుదల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత ప్రభుత్వ నిర్ణయాలకు కొత్త ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అని బిజినెస్ రూల్స్ చెబుతున్నాయి. కానీ కొందరు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు సీఎంవో అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో పాటు పలు శాఖల్లో, మంత్రులు, అధికారుల పేషీల్లో కోవర్టులున్నారా? అనే కోణంలో సీఎంవో ఆరా తీస్తుంది.

విశాఖ ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలపై నివేదిక కోరిన సీఎంవో

విశాఖలో భౌగోళిక వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన ఎర్ర మట్టి దిబ్బల్లో యథేచ్ఛగా తవ్వకాలు జరిగాయి. భీమిలి ఎర్ర మట్టి దిబ్బలను భారీ యంత్రాలతో తవ్వేస్తూ లారీల్లో తరలిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎర్రమట్టి దిబ్బల విధ్వంసంపై ఏపీ సీఎంవో స్పందించింది. తవ్వకాలు నిలిపి వేయాలని జిల్లా అధికారులను ఆదేశించింది. అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పర్యావరణానికి హాని కలిగించే చర్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ తవ్వకాలపై పూర్తి వివరాలతో నివేదిక అందించాలని విశాఖ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

ఎర్రమట్టి దిబ్బలు ముప్పులో ఉన్నాయని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినా అధికారుల అండదండలతో కొందరు యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తు్న్నారని ఆరోపణలు వస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎర్రమట్టి దిబ్బల్లో తవ్వకాలు జరగగా...వివాదాస్పదం అయ్యింది. తాజాగా మరోసారి ఈ విషయం తెరపైకి వచ్చింది. విశాఖ భీమిలి ఎర్రమట్టి దిబ్బల అక్రమ తవ్వకాలపై ప్రభుత్వ యంత్రాంగం స్పందించింది. తవ్వకాలు జరిగిన ప్రాంతాన్ని విశాఖ జేసీ మయూర అశోక్ తన బృందంతో పరిశీలించారు. ఏ మేరకు తవ్వకాలు జరిపారో అంచనా వేసి నివేదిక సిద్ధం చేస్తున్నారు. తవ్వకాలపై నివేదిక అందించాలని సీఎంవో విశాఖ కలెక్టర్ ను ఆదేశించింది.

Whats_app_banner

సంబంధిత కథనం