AP Jobs : ఏపీ వైద్యారోగ్య శాఖ పరిధిలో 55 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!
AP Jobs : ఏపీ మెడికల్ సర్వీసెస్ బోర్డు 55 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అప్లికేషన్లు ప్రారంభం కాగా ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
AP Jobs : ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోడల్ ఆఫీసర్స్ పోస్టుల(APMSRB Recruitment Jobs) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. డీఎంఈ కార్యాలయంలో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, డేటా అనలిస్ట్, ప్రోగ్రామ్ అసిస్టెంట్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఫెసిలిటీ మేనేజర్, ప్రోగ్రామర్ తో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Job Notification) విడుదల చేశారు. మొత్తం 55 పోస్టులను ఒక సంవత్సర కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
వయో పరిమితి
- ఓసీ అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదల తేదీ నాటికి 42 సంవత్సరాలు నిండి ఉండకూడదు.
- EWS/SC/ST/BC అభ్యర్థులు 47 సంవత్సరాలు నిండి ఉండకూడదు
- దివ్యాంగులకు 52 సంవత్సరాలు నిండి ఉండకూడదు
- నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి మాజీ సైనికులు 50 సంవత్స రాలు నిండి ఉండకూడదు
దరఖాస్తు విధానం
అభ్యర్థులు దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా https://dme.ap.nic.in వెబ్ సైట్ ద్వారా సమర్పించాలి. ఆన్ లైన్ అప్లికేషన్లు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 25వ తేదీ రాత్రి 11.59 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసీ అభ్యర్థులు రూ. 1000 దరఖాస్తు రుసుము(Exam Fee) చెల్లించాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్- సర్వీస్ మెన్, వికలాంగ అభ్యర్థులు రూ.500 ఆన్ లైన్ మోడ్ లో రుసుము చెల్లించాలి.
ఎంపిక విధానం
రిజర్వేషన్ రూల్ ఆధారంగా మెరిట్ జాబితా (Merit List)ఎంపిక ఉంటుంది. మెరిట్ జాబితా, రోస్టర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం 100 మార్కులు విధానంలో అభ్యర్థులను ఎంపిక చేశారు. అర్హత డిగ్రీలో పొందిన మార్కులు/గ్రేడ్‌లకు 75 శాతం మార్కులు, అనుభవం, ఇతర మెరిట్ అంశాలకు తగిన పర్సెంటెజ్ ఇస్తారు.
పోస్టుల సంఖ్య
- నోడల్ ఆఫీసర్లు- 8
- ఫెసిలిటీ మేనేజర్లు-11
- సిస్టిమ్ అడ్మినిస్ట్రేటర్లు-13
- డేటా అనలిస్ట్-13
- ఎంఐఎస్ మేనేజర్-1
- ప్రోగామ్ అసిస్టెంట్-08
- ప్రోగ్రామర్-1
జీతభత్యాలు
- నోడల్ ఆఫీసర్లు-రూ.70 వేలు
- ఫెసిలిటీ మేనేజర్లు-రూ.50 వేలు
- సిస్టిమ్ అడ్మినిస్ట్రేటర్లు-రూ.50 వేలు
- డేటా అనలిస్ట్-రూ.50 వేలు
- ఎంఐఎస్ మేనేజర్-రూ.50 వేలు
- ప్రోగామ్ అసిస్టెంట్-రూ.50 వేలు
- ప్రోగ్రామర్-రూ.50 వేలు
హైదరాబాద్ మింట్‌లో కొలువులు
ప్రభుత్వరంగ సంస్థ అయిన హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ ప్రెస్ లో(Security Printing Press Hyderabad Recruitment) పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన వెలువడింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 96 పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. ఇందులో అత్యధికంగా జూనియర్ టెక్నిషియన్(ప్రింటింగ్, కంట్రోల్) 68 ఉద్యోగాలు ఉన్నాయి. దరఖాస్తుల ప్రక్రియ మార్చి 15వ తేదీతో ప్రారంభమైంది. ఏప్రిల్ 15వ తేదీతో ఈ గడువు ముగియనుంది. https://spphyderabad.spmcil.com వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తులను సమర్పించవచ్చు.
ఉద్యోగాల వివరాలు :
- సూపర్‌వైజర్ (TO- ప్రింటింగ్) - 02.
- సూపర్‌వైజర్ (టెక్- కంట్రోల్): 05.
- సూపర్‌వైజర్ (ఓఎల్): 01.
- జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 12.
- జూనియర్ టెక్నీషియన్ (ప్రింటింగ్/ కంట్రోల్): 68.
- జూనియర్ టెక్నీషియన్ (ఫిట్టర్): 03.
- జూనియర్ టెక్నీషియన్ (వెల్డర్): 01.
- జూనియర్ టెక్నీషియన్ (ఎలక్ట్రానిక్స్/ ఇన్‌స్ట్రుమెంటేషన్): 03.
- ఫైర్‌మ్యాన్: 01.
సంబంధిత కథనం