Singareni Jobs 2024 : సింగరేణి నుంచి మరో నోటిఫికేషన్ - 327 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు-singareni latest recruitment notification released for 327 jobs 2024 check the details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Singareni Jobs 2024 : సింగరేణి నుంచి మరో నోటిఫికేషన్ - 327 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు

Singareni Jobs 2024 : సింగరేణి నుంచి మరో నోటిఫికేషన్ - 327 ఉద్యోగాల భర్తీకి ప్రకటన, ఏప్రిల్ 15 నుంచి దరఖాస్తులు

Maheshwaram Mahendra Chary HT Telugu
Mar 14, 2024 08:23 PM IST

Singareni Recruitment 2024 Updates: సింగరేణి సంస్థ నుంచి మరో ఉద్యోగ ప్రకటన జారీ అయింది. ఇందులో భాగంగా 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 15వ తేదీ నుంచే దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి.

సింగరేణిలో ఉద్యోగాలు
సింగరేణిలో ఉద్యోగాలు (https://scclmines.com/s)

Singareni Recruitment 2024 Updates: నిరుద్యోగులకు సింగరేణి సంస్థ మరో గుడ్ న్యూస్ చెప్పింది. 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను(Singareni Recruitment) విడుదల చేసింది. ఇందులో మేనేజ్ మెంట్ ట్రైనీ, జూనియర్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైమీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రిషియన్ ట్రైనీ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్ 15,2024 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 4వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. https://scclmines.com/  వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను సమర్పించవచ్చు. 

ముఖ్య వివరాలు:

ఉద్యోగ ప్రకటన - సింగరేణి సంస్థ

ఉద్యోగ ఖాళీలు - 327

ఖాళీల వివరాలు :

మేనేజ్ మెంట్ ట్రైనీ(E2 గ్రేడ్) - 42

మేనేజ్ మెంట్ ట్రైనీ సిస్టమ్స్ - 07

జూనియర్ ఇంజినీర్ ట్రైనీ(గ్రేడ్ సీ) -100

జూనియర్ ఇంజినీర్ ట్రైనీ(మెకానికల్)- 09

అసిస్టెంట్ ఫోర్ మెన్ ట్రైనీ -24

ఫిట్టర్ ట్రైనీ - 47

ఎలక్ట్రిషియన్ ట్రైనీ - 98

మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఉండగా, మిగతా పోస్టులు నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ లో ఉన్నాయి.

వయోపరిమితి - వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు.( ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు.)

పూర్తి స్థాయి నోటిఫికేషన్ ను ఏప్రిల్ 15,2024వ తేదీన వెబ్ సైట్ లో ఉంచుతారు.

వయోపరిమితి - 30ఏళ్ల లోపు ఉండాలి.(ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 5 ఏళ్ల మినహాయింపు ఉంటుంది )

దరఖాస్తులు - ఆన్ లైన్ విధానం

దరఖాస్తులు ప్రారంభం - ఏప్రిల్ 15, 2024.

దరఖాస్తుల ప్రక్రియకు తుది గడువు - మే , 04, 2024.

అధికారిక వెబ్ సైట్ - . https://scclmines.com/  

ఇటీవలనే నోటిఫికేషన్….

Singareni Recruitment 2024: డెరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ విధానంలో 272 పోస్టుల భర్తీకి ఇటీవలనే నోటిఫికేషన్ ఇచ్చింది సింగరేణి సంస్థ(Singareni). ఈ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. మార్చి 18వ తేదీతో గడువు పూర్తి కానుంది. 

ఖాళీల వివరాలు - ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) - 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ -10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) - 02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) -18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) - 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) - 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ - 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ - 30 ఉన్నాయన్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) - 16.

వయోపరిమితి - వైద్యాధికారి పోస్టు మినహా మిగిలిన పోస్టులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా నిర్ణయించారు.( ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వరకు గరిష్ట వయోపరిమితి మినహాయింపు ఇచ్చారు.)