Kadapa Murder: కడప జిల్లా పొద్దుటూరులో ఘోరం, యువకుడిని చంపి ముక్కలుగా చేసి పారేశాడు..
Kadapa Murder: కడపలో ఘోర హత్య జరిగింది. గొడ్డలితో యువకుడిని అతి కిరాతకంగా నరికి హత్య చేశారు.ఆపై ముక్కలు ముక్కలుగా చేసి గోనెసంచుల్లో కుక్కి పాడేసిన ఘటన వెలుగు చూసింది.
Kadapa Murder: కడపలో యువకుడిని గొడ్డలితో అతి కిరాతకంగా నరికి హత్య చేశారు. ఆ తరువాత ఆ బాడీని ముక్కలు ముక్కలుగా చేసి, గోనె సంచుల్లో కుక్కి, దూరంగా తీసుకెళ్లి పడేశారు. ఈ దారుణం ఆస్తి కోసమే జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండల కేంద్రంలోని వైఎంఆర్ కాలనీలో చోటు చేసుకుంది. వెంకట మహేశ్వరరెడ్డి (28)ని అతికిరాతకంగా హత్యకు భూమిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్పడ్డాడు. మహేశ్వరరెడ్డి తల్లి నాగరత్నమ్మ, నిందితుడు రామచంద్రారెడ్డి 20 ఏళ్లగా సహజీనం చేస్తున్నారు. అయితే నాగరత్నమ్మ సొంత భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు.
అయితే ఎప్పటి నుంచో ఒకే ఇంట్లో నిందితుడు రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ, హత్యకు గురైన యువకుడు మహేశ్వరరెడ్డి ఉంటున్నారు. వీరు స్వీట్ల వ్యాపారం, క్యాటరింగ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అందరూ కలిసి మెలిసి ఎటువంటి గొడవులు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. మహేశ్వర రెడ్డి ఒక సిమెంట్ పరిశ్రమలో పని చేస్తున్నాడు. అయితే ఇటీవలి రామచంద్రారెడ్డికి మహేశ్వరరెడ్డికి మధ్య పొక్కటం లేదు. డబ్బుల విషయమై మహేశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డికి మధ్య గొడవ జరిగింది. మాట మాట పెరిగి మహేశ్వరరెడ్డిపై దాడికి రామచంద్రారెడ్డి దిగాడు.
మహేశ్వరరెడ్డి, రామచంద్రారెడ్డిలకు మద్యం తాగే అలవాటు ఉంది. మహేశ్వరరెడ్డి తల్లికి నాగరత్నమ్మకు ఉబకాయంతో ఉండటం వల్ల మెడిసిన్ వాడుతుంది. దీంతో ఆమె మత్తుగా ఉండటంతో తన రూమ్‌కి వెళ్లి పడుకుంది. ఆమె వాడే మెడిసిన్‌లో ఓ ఇంజక్షన్ చాలా మత్తుగా ఉంటుంది. అది రాత్రి వేసుకుంటే ఉదయం వరకు మెలకురానేరాదు. తెల్లవారుజామున లేచి చూస్తే ఇళ్లంతా రక్తపుమడులో ఉంది. అలాగే రామచంద్రారెడ్డి గోనె సంచిలో ఏదో తీసుకెళ్తూ నాగరత్నమ్మకు కనిపించాడు. దీంతో అవి ఏంటనీ నాగరత్నమ్మ ప్రశ్నించగా, పాత సామాన్ల మూట అని సమాధానం ఇచ్చాడు. అనంతరం నాగరత్నమ్మ ఇంట్లోకి వెళ్లి చూడగా హత్య జరిగినట్లు తెలుసుకుంది.
మహేశ్వరరెడ్డిని రామచంద్రారెడ్డి గొడ్డలి వేటతో నరికి హత్య చేశాడు. తరువాత గొడ్డలి, కత్తి సహయంతో మహేశ్వరరెడ్డి బాడీని ముక్కలుగా చేసిన రెండు గోనెసంచుల్లో కుక్కాడు. ఇంటి నుంచి ద్విచక్రవాహనంలో రెండు గోనెసంచులను తీసుకొని ప్రొద్దుటూరు పట్టణ శివారులో పడేశాడు. తిరిగి వచ్చి నాగరత్నమ్మకు టిఫిన్ ఇచ్చి వెళ్లిపోయాడు.
నాగరత్నమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐలు వెంకటరమణ, అబ్దుల్ కరీం, పోలీసు సిబ్బంది ఇంట్లో గొడ్డలి, కత్తి, కొన్ని శరీర భాగాలను ఉన్నట్లు గుర్తించారు. అయితే మృతదేహం కనిపించలేదు. దీంతో మృతదేహం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రామచంద్రారెడ్డి సంచులతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు కావడంతో ఆయన వెళ్తున్న మార్గాన్ని గుర్తించారు. అయితే ఆ గోనె సంచులు ఎక్కడ పడేశాడనేది గుర్తించలేకపోయారు.
డ్వాగ్ స్వ్కాడ్ కూడా గుర్తించ లేకపోయింది. అయితే సాయంత్రం చిన్నశెట్టిపల్లెరోడ్డులోని మైలవరం నార్త్ కాలువ వద్ద శరీర భాగాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ శరీర భాగాలను పోలీసులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు.
మొత్తం జరిగిన విషయాన్ని నాగరత్నమ్మ పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహేశ్వరరెడ్డి శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసిన ప్రొద్దుటూరు పట్టణం శివారు ప్రాంతంలో వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్‌పీ మురళీధర్ తెలిపారు. నిందితుడు రామచంద్రారెడ్డి పరారీలో ఉన్నాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)