Couple Suicide Attempt: పెళ్లైన ఐదు రోజులకే యువజంట ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి
Couple Suicides Attempt: పశ్చిమ గోదావరి జిల్లాలో పెళ్ళైన ఐదు రోజులకే యువజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Couple Suicides Attempt: పెళ్లై ఐదు రోజుల్లోనే యువజంట మధ్య వివాదం తలెత్తి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటనలో యువతి ప్రాణాలు కోల్పోయింది. నవ వధూవరులు గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించడంతో యువతి గల్లైంది. యువకుడు నది నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. పెనుగొండ మండలం వడలిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పెళ్లైన నాలుగో రోజే యువజంట గోదావరిలో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించారు. సినిమాకు వెళ్లి వస్తుండగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. క్షణికావేశంలో నవ వధువు సత్యవతి, వరుడు శివరామకృష్ణ సిద్ధాంతం వంతెన మీద నుంచి నదిలో దూకారు. ఈ ఘటనలో వరుడిని మత్య్సకారులు కాపాడారు. వధువు సత్యవతి మృతదేహాన్ని బుధవారం సాయంత్రం వెలికి తీశారు.
ఈ నెల 15న కోరాడ సత్యవతితో కైలా రామకృష్ణకు వివాహం జరిగింది.మంగళవారం సాయంత్రం సిద్ధాంతం వంతెనపై ఈ ఘటన జరగడంతో గ్రామంలో కలకలం రేగింది. నదిలో దూకిన తర్వాత వధువు గల్లంతు కావడంతో గ్రామస్తులు గాలింపు చేపట్టారు. నదిలో ఈదుకుంటూ వరుడు ఒడ్డుకు చేరుకున్న తర్వాత అతడిచ్చిన సమాచారంతో వధువు ఆచూకీ కోసం బుధవారం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టారు.
ఉండ్రాజవరం మండలం మోర్తకు చెందిన కె.శివరామకృష్ణతో వడలికి చెందిన కోరాడ సత్యవాణికి డిసెంబరు 15న అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో వివాహం జరిగింది. మంగళవారం రాత్రి వడలి నుంచి సినిమాకి వెళ్తున్నామని చెప్పి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చారు. ఆ తర్వాత సిద్ధాంతం వంతెన వద్ద వాహనం, వరుడు ఈదుకొచ్చిన చోట వధువు చెప్పులు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. శివరామకృష్ణను తణుకులోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అనంతరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. సత్యవతి మృతదేహాన్ని బుధవారం వెలికి తీశారు.
సత్యవతి తల్లి మానసిక సమస్యలతో బాధపడుతుండటంతో చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలో పెరిగింది. వడలిలోని అమ్మమ్మ, తాతయ్యల సంరక్షణలోనే పెరిగిన ఆమెకు ఇటీవల వివాహం చేశారు. కట్నం రూ.లక్షా అరవై వేలు, బంగారు ఆభరణాలు పెట్టామని బంధువులు చెబుతున్నారు. సత్యవతికి అక్క మౌనిక, బావ రాము ఉన్నారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఆమెకు లేదని భర్త శివరామకృష్ణ ఏదో చేసి నాటకం ఆడుతున్నాడని వధువు బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పెనుగొండ ఎస్సై రమేష్ తెలిపారు.