Road Accident: తూర్పు గోదావరిలో భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన లారీ-a lorry rammed into bhavani devotees killing one and injuring four others ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Road Accident: తూర్పు గోదావరిలో భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

Road Accident: తూర్పు గోదావరిలో భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన లారీ

Sarath chandra.B HT Telugu
Dec 29, 2023 09:36 AM IST

Road Accident: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలి నడకన విజయవాడ దుర్గ గుడికి వెళుతున్న భవానీ భక్తులను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

తూర్పు గోదావరి  జిల్లాలో రోడ్డు ప్రమాదం
తూర్పు గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం

Road Accident: బెజవాడ ఇంద్రకీలాద్రికి కాలినడకన వెళుతున్న భవానీ భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విజయవాడ దుర్గగుడిలో అమ్మవారికి ఇరుముళ్లు సమర్పించుకునేందుకు కాలినడకన భవానీ భక్తులు యలమంచిలి నుంచి బయల్దేరారు. గురువారం రాత్రి వీరు నల్లజర్ల సమీపంలో జాతీయ రహదారిపై నడుస్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని హైవే పెట్రోలింగ్ సిబ్బంది తెలిపారు. బాధితులు యలమంచిలి మండలం కొక్కిరాయిపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. చీకట్లో కాలి నడకన వెళుతున్న వారిని గుర్తించకపోవడంతో ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.

Whats_app_banner