తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Poland Football Team : పోలాండ్​ ఫుట్​బాల్​ జట్టుకు యుద్ధ విమానాల రక్షణ.. పుతిన్​కు భయపడే!

Poland football team : పోలాండ్​ ఫుట్​బాల్​ జట్టుకు యుద్ధ విమానాల రక్షణ.. పుతిన్​కు భయపడే!

19 November 2022, 13:19 IST

Poland football team escorted by F16 : ఫీఫా ప్రపంచ కప్​నకు రష్యా ఉక్రెయిన్​ యుద్ధం సెగ తగిలినట్టు కనిపిస్తోంది. ఫీఫా వరల్డ్​ కప్​లో పాల్గొనాల్సిన పోలాండ్​ ఫుట్​బాల్​ జట్టుకు ఆ దేశ యుద్ధ విమానాలు రక్షణ కల్పించాయి. పోలాండ్​ నుంచి విమానంలో ఆటగాళ్లు బయలుదేరగా.. దేశ సరిహద్దు వరకు దాని వెంటే వెళ్లాయి ఎఫ్​-16 జెట్స్​. యుద్ధం నేపథ్యంలో ఇటీవలే.. ఓ మిసైల్​ పడి ఇద్దరు పోలాండ్​వాసులు ప్రాణాలు కోల్పోవడంతో పోలాండ్​లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో పోలాండ్​ జట్టుకు ఎఫ్​-16 జెట్​లు రక్షణ కల్పించడం వైరల్​గా మారింది.