Amarnath Yatra | అమర్నాథ్ యాత్రికులకు జమ్మూ బేస్ క్యాంపులో యోగా శిబిరం
04 July 2023, 13:18 IST
- హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. దక్షిణ కశ్మీర్ లోని మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు యాత్రికులు ఏటా పెద్ద ఎత్తున వెళ్తారు. ఈ జులై 2 అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. ఈ యాత్ర అత్యంత సాహసోపేతంగా ఉంటుంది. ఈ క్రమంలోనే యాత్రలో పాల్గొనే వారికి జుమ్ములో ప్రత్యేకంగా యోగా క్యాంపులు ఏర్పాటు చేశారు. యాత్రకు ముందు యాత్రికులకు యోగాసనాలు చేయిస్తున్నారు.