తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walnut Cake Recipe : కేక్​లందు.. వాల్​నట్​ కేక్ వేరయా.. ఎందుకంటే..

Walnut Cake Recipe : కేక్​లందు.. వాల్​నట్​ కేక్ వేరయా.. ఎందుకంటే..

11 September 2022, 11:00 IST

google News
    • Walnut Cake Recipe : పిల్లలకు ఆరోగ్యకరమైన డెజర్ట్‌ పెట్టాలనుకునేవారికి..  ఆరోగ్యం కోసం స్వీట్స్ తగ్గించి కడుపు మాడ్చుకుంటున్నవారికి ఓ ప్రత్యేక రెసిపీ ఉంది. అదే వాల్‌నట్‌ కేక్. దీనిలో అదనపు ఆరోగ్యాన్ని అందించే పోషకాలు చాలానే ఉన్నాయి. పైగా దీనిని ఎవరైనా హ్యాపీగా లాగించేయవచ్చు. మరి ఈ సండే ఈ కేక్​తో స్వీట్​గా సాగనివ్వండి.
వాల్ నట్ కేక్ రెసిపీ
వాల్ నట్ కేక్ రెసిపీ

వాల్ నట్ కేక్ రెసిపీ

Walnut Cake Recipe : మీకు స్వీట్ టూత్ ఉందా? అయినా సరే ఆరోగ్యం కోసం స్వీట్స్ తినడం మానేసారా? అయితే ఈ రెసిపీ మీకోసమే. పైగా పిల్లలకు స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. వారికి ఆరోగ్యకరమైన స్వీట్ ఇవ్వాలనుకుంటే వాల్‌నట్‌ కేక్ తయారు చేసి పెట్టేయండి. పైగా వాల్‌నట్స్ వల్ల కలిగే లాభాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి హృదయ ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రయోజనాలు చూపిస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ ఆరోగ్యకరమైన కేక్ తయారు చేసి.. ఇంట్లోవారి, మీ స్వీట్ క్రేవిగ్స్ తీర్చేసుకోండి.

కావలసిన పదార్థాలు

* వాల్‌నట్స్

* రోల్డ్ వోట్స్

* వోట్ పిండి

* ఖర్జూరాలు - ప్యూరీ చేసుకోవాలి

* చియా విత్తనాలు

* వెనిలా ఎసెన్స్

* బేకింగ్ పౌడర్

* ఉప్పు

* వాల్‌నట్‌లు - తరగినవి

వాల్‌నట్స్ ఫ్రై చేయడానికి

* బటర్

* డేట్స్ ప్యూరీ

* తేనె

* వాల్ నట్స్

తయారీ విధానం

ముందుగా బేకింగ్ అచ్చు తీసుకోండి. రోల్డ్ వోట్స్, ఓట్స్ పిండి, ప్యూరీ చేసిన ఖర్జూరాలు, చియా గింజలను కలపండి. దానిలో వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, ఉప్పు, తరిగిన వాల్‌నట్‌లను వేసి బాగా కలపండి. ఈ పదార్థాలను బాగా మిక్స్ అయ్యేవరకు కలపండి. దీనిని బేకింగ్ గిన్నేలో వేయండి.

వాల్‌నట్‌లను పంచదార పాకం చేయడానికి ఒక పాన్‌లో కొద్దిగా బటర్ వేసి.. ఖర్జూరం ప్యూరీ, తేనె, వాల్‌నట్‌లను వేసి ఫ్రై చేసి పక్కన పెట్టండి. ఈ వాల్‌నట్‌లను మీ కేక్ పిండి పైభాగంలో ఉంచండి. దీనిని 200 డిగ్రీల సెల్సియస్ వద్ద 25 నిమిషాలు ఉంచండి. అంతే రుచికరమైన వాల్‌నట్ కేక్ రెడీ అయిపోయినట్లే.

టాపిక్

తదుపరి వ్యాసం