తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ys Sharmila Padayatra: త్వరలో ముగియనున్న షర్మిల పాదయాత్ర.. ప్లేస్, డేట్ ఫిక్స్

YS Sharmila Padayatra: త్వరలో ముగియనున్న షర్మిల పాదయాత్ర.. ప్లేస్, డేట్ ఫిక్స్

HT Telugu Desk HT Telugu

17 February 2023, 13:09 IST

google News
    • ys sharmila praja prasthanam padayatra updates: వైఎస్ షర్మిల పాదయాత్ర ముగింపు దశకు చేరుకుంది. మార్చి 5వ తేదీన పాలేరులో ముగింపు సభను నిర్వహించనున్నారు.
పాదయాత్రలో వైఎస్ షర్మిల
పాదయాత్రలో వైఎస్ షర్మిల

పాదయాత్రలో వైఎస్ షర్మిల

YS Sharmila praja prasthanam Padayatra: వైఎస్ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే 3700కి పైగా కిలోమీటర్లకుపైగా పూర్తి అయింది. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో యాత్ర కొనసాగుతుండగా... త్వరలోనే పాదయాత్ర ముగియనుంది. యాత్ర ముగింపునకు పాలేరు వేదిక కానుంది. ఈ మేరకు వైఎస్ఆర్టీపీ కీలక ప్రకటన చేసింది.

వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర పాలేరులో ముగియనుంది. నియోజకవర్గం పరిధిలోని కూసుమంచిలో మార్చి 5 న ముగింపు సభను నిర్వహించనున్నారు. 4111 కి.మీ మైలు రాయి వద్ద షర్మిల తన పాదయాత్రను ముగించనున్నారు. ఫిబ్రవరి 20న పాదయాత్ర... పాలేరు నియోజకవర్గానికి చేరుతుంది. మహబూబాబాద్,డోర్నకల్ నియోజక వర్గాల్లో పాదయాత్ర ముగించుకొని పాలేరులో అడుగుపెట్టనున్నారు షర్మిల. 14 రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో యాత్ర కొనసాగనుంది.

చేవెళ్ల నుంచి ప్రారంభం....

2021 అక్టోబర్ 20న సెంటిమెంట్‌గా చేవెళ్ల నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభించారు. తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. తెలంగాణలో కొత్తగా పార్టీ స్థాపించిన షర్మిల... తెలంగాణ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దొరల పాలన అంటూ కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్టీపీని ఆదరించాలని ప్రజలను కోరుతూ వస్తున్నారు. షర్మిల పాదయాత్ర(నర్సంపేట)లో ఉద్రిక్తతలు తలెత్తడంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కొన్ని రోజులు ఆమె పాదయాత్ర ఆగిపోయింది. తరువాత కోర్టుకు వెళ్లి పాదయాత్రకు అనుమతి తెచ్చుకున్నారు. తిరిగి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచే మరోసారి తన పాదయాత్ర మొదలుపెట్టి... ముందుకు కదులుతున్నారు.

పాలేరు నుంచి పోటీ…

sharmila contest from paleru: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేస్తానని షర్మిల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే నియోజకవర్గానికి చెందిన నేతలతో పలుమార్లు సమీక్షలు కూడా చేశారు. ఇక నుంచి పాలేరే తన ఊరు అని ప్రకటించారు.

తదుపరి వ్యాసం