3D printed Temple : తెలంగాణ వేదికగా ప్రపంచలోనే తొలి 3డీ ప్రింటెడ్ ఆలయం- విశేషాలివే
01 June 2023, 15:59 IST
- Worlds 1st 3D Printed Temple in Telangana: ప్రపంచంలోనే మొదటి 3డి ప్రింటెడ్ ఆలయాన్ని తెలంగాణలో నిర్మిస్తున్నారు. అప్సుజా ఇన్‌ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ పనులు జరగనున్నాయి.
3డి ప్రింటెడ్ ఆలయ నమూనా
3D Printed Temple in Telangana: ప్రపంచం లోని మొట్ట మొదటి త్రీడీ ముద్రిత ఆలయాన్ని నిర్మించనున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ ఫ్రా టెక్... ఈ పనులను చేపట్టింది. ఆర్కిటెక్చరల్ వినూత్నతలో అద్భుతమైన ఘనత సాధించడానికి (3d) త్రీడీ ప్రింటెడ్ నిర్మాణ సంస్థ సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ తో చేతులు కలిపింది. దాదాపు 30 అడుగుల ఎత్తులో 3,800 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న హిందూ దేవాలయాన్ని మూడు భాగాల నిర్మాణ అద్భుతంగా రూపొందించాయి. ఇందుకు సంబంధించిన నమూనాలు విడుదల చేశాయి.
ఈ కట్టడంలో మూడు గర్భాలయాలు ఉంటాయి. 'మోదక్' ఆకారంలోనిది గణేశుడికి, దీర్ఘచతురస్రాకార ఆలయం శివుడికి, కమలం ఆకారంలోనిది పార్వతి దేవి కోసం రూపొందించబడ్డాయి. సింప్లిఫోర్జ్ చే అంతర్గతంగా అభివృద్ధి చేసిన సిస్టమ్, దేశీయంగా అభివృద్ధి చేసిన మెటీరియల్, సాఫ్ట్ వేర్‌తో ఈ నిర్మాణం త్రీడీగా ముద్రించబడింది. ప్రపంచవ్యాప్తంగా ఇంత భారీస్థాయిలో ప్రార్థనాస్థలంగా రూపుదిద్దుకున్న మొట్టమొదటి త్రీడీ-ముద్రిత నిర్మాణం ఇదే.
సిద్దిపేటలోని చర్విత మెడోస్‌లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ 3డి-ప్రింటెడ్ టెంపుల్ అప్సుజా.. తాత్వికతకు అనుగుణంగా సాంకేతికత, ప్రకృతిల చక్కటి ఏకీకరణకు నిదర్శనంగా పనిచేస్తుంది. గతంలో చర్విత మెడోస్‌లో భారతదేశపు మొట్టమొదటి త్రీడీ ప్రింటెడ్ బ్రిడ్జ్ ప్రోటోటైప్‌ను అందించింది. ఆ తర్వాత ఈ సహకారం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఘనతల కీర్తికిరీటానికి అంతర్జాతీయ మొదటి స్థానాన్ని అందించింది. ఈ త్రీడీ ప్రింటెడ్ నిర్మాణం అపారమైన సామర్థ్యాన్ని మాత్రమే కాకుండా సింప్లిఫోర్జ్ బృందం అభివృద్ధి చేసిన రోబోటిక్ ఆర్మ్ సిస్టమ్ నిర్మాణ స్వేచ్ఛ, సామర్థ్యాలను కూడా ప్రదర్శిస్తుంది.
"పూర్తిగా ఆన్-సైట్ వద్ద ముద్రించబడిన, మోదక్, కమలంతో సహా ఆలయం అద్భుతమైన గోపురం ఆకారపు నిర్మాణాలు సవాళ్లను నిర్మాణ బృందానికి అందించాయి. ఆలయ సూత్రాలను అనుసరిస్తూ, అవసరాలకు అనుగుణంగా డిజైన్ పద్ధతులు, కచ్చితమైన విశ్లేషణ, వినూత్న నిర్మాణ పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉన్న ఆర్కిటెక్చర్ ఫలితమే విస్మయం కలిగించే ఈ నిర్మాణ అద్భుతం”... అని అప్సుజా ఇన్‌ఫ్రాటెక్ ఎండి హరి కృష్ణ జీడిపల్లి వివరించారు. "శివాలయం, మోదక్ నిర్మాణం పూర్తి కావడం తో, కమలం, పొడవైన గోపురాలతో కూడిన రెండవ దశ ఇప్పటికే మొదలైంది" అని కూడా ఆయన తెలిపారు.
“ఈ నిర్మాణం సింప్లిఫోర్జ్ 51º , 32ºలను వరుసగా బయటి, లోపలి కాంటిలివర్‌లలో ముద్రించగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది, ప్రత్యేకించి నిర్మాణ/ సౌందర్య అవసరాలకు అనుగుణంగా ఇన్-సిటు క్యాటరింగ్‌ను ముద్రించేటప్పుడు. నిర్మాణ అవసరాలు, ఆలయ రూపకల్పన సూత్రాలు, 3డి ప్రింటింగ్ అవసరాలు, ఇన్-సిటు నిర్మాణంలో సవాళ్లతో వ్యవహరించేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటుంది. సరిహద్దులు, ఎత్తైన ప్రాంతాలు, ఎడారులు, మంచుతో నిండిన ప్రాంతాలు వంటి అసాధ్యమైన ప్రాంతాలలో సింప్లిఫోర్జ్ బలమైన వ్యవస్థలు భవిష్యత్తు వినియోగాలకు పటిష్ఠ వేదిక ను ఏర్పాటు చేయగలవని ఈ నిర్మాణం నిరూపించింది అని సింప్లి ఫోర్జ్ క్రియేషన్స్ సీఈఓ ధృవ్ గాంధీ అ న్నారు.
ఈ ఘన విజయంతో… అప్సుజా ఇన్‌ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ నిర్మాణ పరిశ్రమలో తమకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పరచుకోవడమే కాకుండా, త్రీడీ ప్రింటెడ్ ఆర్కిటెక్చర్‌లో భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలబెట్టాయి.