Weather Updates: పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు.. ఆ ప్రభావంతో తేలికపాటి వర్షాలు
26 April 2022, 10:27 IST
- తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మళ్లీ మండుతున్నాయి.కొన్ని చోట్ల 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం కారణంగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీ తెలంగాణ వాతావరణం
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణతో పాటు సీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉంది. కొన్నిచోట్ల పాక్షికంగా మోఘామృతమై ఉంటుంది. పడమర, నైరుతి దిశల నుంచి 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ, రామగుండంలో ఎండల తీవ్రత ఎక్కువగా నమోదైంది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న గాలుల ప్రభావం వాతావరణంలో ఈ మార్పులు చోటు చేసుకున్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణతో పాటు సీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
తెలంగాణలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉంది. కొన్నిచోట్ల పాక్షికంగా మోఘామృతమై ఉంటుంది. పడమర, నైరుతి దిశల నుంచి 6 నుంచి 10 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు మాత్రం రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలోని చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ, రామగుండంలో
ఏపీలోని విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు రావొచ్చు. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోనూ వర్ష సూచన ఉంది. ఇక పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కాకినాడ, తుని, రాజమండ్రి ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సీమ జిల్లాల్లో ఎండల దాటికి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ పరిస్థితి కర్నూలు, తిరుపతి, నంద్యాలలో ఎక్కువగా ఉంది. అయితే సీమ ప్రాంతంలోని కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వడదెబ్బకు గురి కాకుండా ఎక్కువ మోతాదులో మంచినీళ్లను తీసుకోవాలి సలహా ఇస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో గొడుగులు వాడటం మంచిదని చెబుతున్నారు.
టాపిక్