తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ.. అరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ.. అరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ

HT Telugu Desk HT Telugu

27 March 2022, 8:39 IST

google News
    • తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు.  ఫలితంగా రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. శనివారం పగటి ఉష్ణోగ్రతలు... 40 డిగ్రీలకుపైగా దాటిపోయాయి. కొద్దిరోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు

తెలుగు రాష్ట్రాలో పొడి వాతావరం కొనసాగుతుంది. అసని తుపాన్ తరువాత ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మరిన్ని రోజుల్లో ఉష్ణోగ్రతల స్థాయి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పలు చోట్ల ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఎండలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది.

తెలంగాణలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో 41 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. కొత్తగూడెం, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ కరీంనగర్, నల్గొండ, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా కొత్తగూడెం, జగిత్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లో వేడి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉక్కపోత తీవ్రంగా ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యో అవకాశం ఉంది. సీమ జిల్లాల్లో ఎండులు భగభగ మండుతున్నాయి. అనంతపురం, నంద్యాల, కర్నూలులో 39 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

అవసరమైతే తప్ప ప్రజలు మధ్యాహ్నం వేళ ఎండలో బయట తిరగకూడదదని నిపుణులు సూచిస్తున్నారు. అధికంగా నీళ్లను తీసుకోవాలి.. గొడుగులను వాడటం మంచిదని సలహా ఇస్తున్నారు.

తదుపరి వ్యాసం