తెలుగు న్యూస్  /  Telangana  /  Tsrtc To Operate 390 Special Buses From Hyderabad To Srisailam On The Occasion Of Maha Shivaratri

TSRTC Srisailam Special Buses:శివరాత్రి స్పెషల్.. శ్రీశైలానికి 390 ప్రత్యేక బస్సులు

HT Telugu Desk HT Telugu

08 February 2023, 15:22 IST

    • Special buses from Hyderabad to Srisailam: మల్లన్న భక్తులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. మహాశివరాత్రిని పురస్కరించుకుని శ్రీశైలానికి వెళ్లే వారికోసం 390 స్పెషల్ బస్సులను నడపనుంది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు(ఫైల్ ఫొటో)
శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు(ఫైల్ ఫొటో) (tsrtc)

శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు(ఫైల్ ఫొటో)

TSRTC Special Buses to Srisailam: మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. హైదరాబాద్ నుంచి మొత్తం 390 ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈనెల 16 నుంచి 19 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఈ బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

US Student Visa Slots: మే రెండో వారంలో అందుబాటులోకి యూఎస్‌ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్లు

TS Govt Pleader: మహిళను వేధిస్తున్న పోకిరి ప్లీడర్ ఆటకట్టు, నిందితుడు మాజీ గవర్నమెంట్‌ ప్లీడర్

Siddipet District : తండ్రిని చూసుకోని తనయుడు...! కొండగట్టు ఆలయానికి ఆస్తిని రాసిచ్చేందుకు సిద్ధమైన తండ్రి

TS Inter Supply Exams 2024 : అలర్ట్... తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫీజు గడువు పొడిగింపు, ఎప్పటివరకంటే..

పాయింట్స్ ఇవే...

హైదరాబాద్ లోని ఎంజీబీఎస్, జూబ్లీబస్‌స్టేషన్‌, దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌స్టేషన్‌, ఐఎస్‌ సదన్‌, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈల్‌ పాయింట్లతో పాటు నగరంలోని పలు ఇతర ప్రారతాల నుంచి ఈ స్పెషల్ బస్సులు నడపనున్నారు. 16 వ తేదీన 36 ప్రత్యేక బస్సులు నడపాలని... 17వ తేదీన 99, 18న 99 బస్సులు... ఇక 19న 88 బస్సులు నడపాలని అధికారులు నిర్ణయించారు. మిగతా 68 బస్సులు ఇతర ప్రాంతాల నుంచి నడపనున్నట్టు వెల్లడించారు.

టికెట్ రేట్లు...

ఎంజీబీఎస్ నుంచి శ్రీశైలానికి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.600, డీలక్స్‌లో రూ.540, ఎక్స్‌ప్రెస్ లో రూ.460 తీసుకుంటారు. నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి సూపర్‌ లగ్జరీలో ఒకరికి రూ.650, డీలక్స్‌లో రూ.580, ఎక్స్‌ప్రె్‌స్‌లో రూ.500 వసూలు చేస్తారు. ఇప్పటికే రిజర్వేషన్ ప్రక్రియ నడుస్తోంది. పలు ఫోన్ నెంబర్లను(99592 26250, 9959226248, 9959226257, 9959226246, 040-27802203, 9959226250, 9959226149) అందుబాటులోకి తీసుకువచ్చారు. మరిన్ని వివరాల కోసం టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in ను సందర్శించవచ్చు.

శ్రీశైలం బ్రహ్మోత్సవాలు

Srisailam Maha Shivratri Brahmotsavam 2023: మహాశివరాత్రి... దేశవ్యాప్తంగా శివాలయాలకు భారీగా తరలివచ్చే పండగ. భక్తులు ఉపవాసాలు ఉండి.. శివాలయాన్ని దర్శించుకుంటారు. రాత్రంతా జాగారం కూడా చేస్తారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే... ప్రముఖ శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతాయి. అందులోనూ ఏపీలోని శ్రీశైలం ప్రత్యేకమని చెప్పొచ్చు. సాధారణ భక్తులతో పాటు శివ మాల ధరించిన భక్తులు భారీగా తరలివస్తుంటారు. మహాశివరాత్రి సందర్భంగా... శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.

ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు మహాశివరాత్రి బ్రహోత్సవాలను నిర్వహించేదుకు ముహుర్తం ఖరారు చేశారు. ఇందుకోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల రోజుల్లో.. ఆలయ దర్శన విధానాల్లో కీలక మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు రెండు రోజుల ముందు 9వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత 23వ తేదీ వరకు 15 రోజులపాటు శివ స్వాములు జ్యోతిర్ముడి సమర్పణకు ఏర్పాట్లు చేయనున్నారు. ఇరుముడి ధారణస్వాములకు మాత్రం 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు నిర్ధిష్ట వేళలో మల్లిఖార్జునిడి స్పర్శదర్శనం కల్పించనున్నారు.