తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 : 563 గ్రూప్ 1 ఉద్యోగాలు... దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ - రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

TSPSC Group 1 : 563 గ్రూప్ 1 ఉద్యోగాలు... దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ - రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

14 March 2024, 14:06 IST

    • TSPSC Group 1 Registration 2024 : ఇవాళ్టితో తెలంగాణ గ్రూప్ -1 దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఫిబ్రవరి 23వ తేదీన ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జూన్ 9వ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు షెడ్యూల్ ను ప్రకటించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. 
తెలంగాణ గ్రూప్ 1
తెలంగాణ గ్రూప్ 1 (https://application.tspsc.gov.in/)

తెలంగాణ గ్రూప్ 1

TSPSC Group 1 Registration 2024 Updates: తెలంగాణలో 563 గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి(TSPSC Group 1 2024) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 23వ తేదీన ప్రారంభం కాగా... ఇవాళ్టి(మార్చి 14)తో ముగియనుంది. ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికిపైగా అప్లికేషన్లు చేసుకున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్గాలు చెబుతున్నాయి. ఇవాళ చివరి తేదీ కావటంతో.... భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 5 లోపు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని టీఎస్పీఎస్సీ(TSPSC) సూచించింది. అర్హత గల అభ్యర్థులు https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఓటీఆర్(One Time Registration) తప్పనిసరిగా ఉండాలి.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

How to Apply TSPSC Group 1: గ్రూప్ 1 దరఖాస్తు ప్రాసెస్ ఇలా...

  • గ్రూప్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు https://www.tspsc.gov.in/ లోకి వెళ్లాలి.
  • ఓటీఆర్(OTR) లేని వారు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓటీఆర్ లేకపోతే దరఖాస్తు చేసుకోలేం. ఓటీఆర్ ఉన్నవారు అప్డేట్ చేసుకోకపోతే చేసుకోవాలి.
  • TSPSC Group 1 Services ఆన్ లైన్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ ఓటీఆర్ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • ఆ తర్వాత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది. మీ అర్హతలతో పాటు ముఖ్య వివరాలను ఎంట్రీ చేయాలి.
  • ఫొటో, సంతకాన్ని అప్ లోడ్ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.
  • ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. దీన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లు జనరేట్ కావాలంటే ఈ రిఫరెన్స్ నెంబర్ ఉపయోగపడుతుంది.

గ్రూప్ 1 నోటిఫికేషన్ ముఖ్య వివరాలు:

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 14,2024.

దరఖాస్తుల ఎడిట్ - మార్చి 23 నుంచి మార్చి 27,2024.

హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.

ప్రిలిమ్స్ పరీక్ష - జూన్ 09 2024.

మెయిన్స్ పరీక్షలు - అక్టోబరు 21, 2024 నుంచి ప్రారంభం అవుతాయి.

అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/

పరీక్షా విధానం:

ఇక గ్రూప్ 1(TS Group 1 Prelims Exam) పరీక్ష విధానం పరీశీలిస్తే..... ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధిస్తినే మెయిన్స్ కు క్వాలిఫై అవుతారు.

ప్రిలిమినరీ పరీక్షను పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ విభాగాల నుంచి 150 ప్రశ్నలు అడుగుతారు.

ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున మొత్తం 150 మార్కులు ఉంటాయి.

పరీక్ష సమయం 2.30 గంటలు ఉంటుంది.

ఇక 2వ దశలో నిర్వహించే మెయిన్‌ పరీక్ష పూర్తిగా డిస్క్రిప్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మొత్తం ఆరు పేపర్లు ఉంటాయి. వీటికి 900 మార్కులు కేటాయించారు.

ఈ 6 పేపర్లకు అదనంగా జనరల్‌ ఇంగ్లీష్‌ అర్హత పేపర్‌గా ఉంటుంది. ఈ పేపర్ ను 150 మార్కులకు నిర్వహిస్తారు. దీనికి 3 గంటల సమయం కేటాయించారు.

తదుపరి వ్యాసం