TSPSC Cancelled AMVI Notification: ఏఎంవీఐ నోటిఫికేషన్ రద్దు… ఎందుకంటే
04 September 2022, 8:00 IST
- assistant motor vehicle inspector notification news: రవాణా విభాగంలో అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది.
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ నోటిఫికేషన్ రద్దు
tspsc cancelled amvi notification: రవాణా విభాగంలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (AMVI) పోస్టుల భర్తీ విషయంలో టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. అభ్యర్థులకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధనపై అభ్యంతరాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అర్హతల విషయంలో అభ్యర్థుల నుంచి పలు విజ్ఞప్తులు వచ్చాయి. ఈ విజ్ఞప్తులను రవాణాశాఖ దృష్టికి తీసుకెళ్లింది టీఎస్పీఎస్సీ.
assistant motor vehicle inspector notification 2022: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) రవాణా విభాగంలో 113 అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి జూలై 27 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల్లో పురుషులకు 72 పోస్టులు, మహిళలకు 41 పోస్టులు కేటాయించారు. వీటిలో మల్టీజోన్-1 పరిధిలో 54 పోస్టులు, మల్టీజోన్-2 పరిధిలో 59 పోస్టులు. వీటిలో ఓసీ-46, ఈడబ్ల్యూఎస్-11, బీసీ-31, ఎస్సీ-16, ఎస్టీ-7, స్పోర్ట్స్ కోటా- 02 పోస్టులు కేటాయించారు. ఆగస్టు 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుండగా.. తాజాగా నోటిఫికేషన్ రద్దు చేస్తున్నట్లు పబ్లిక్ కమిషన్ వెల్లడించింది.
1540 AEE Jobs 2022 Notification: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్పీఎస్సీ(Telangana Public Service Commission). శనివారం 1540 ఏఈఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. పూర్తి నోటిఫికేషన్ సెప్టెంబర్ 15 న విడుదల అవుతుందని ఆ నోటీస్ లో పేర్కొంది.
ఏఈఈ నోటిఫికేషన్
AEE Jobs 2022 Notification: ఏఈఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 22 నుంచి దరఖాస్తులు మొదలు కానున్నాయి. అక్టోబర్ 14, 2022 వరకు దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో స్వీకరించనున్నారు. మొత్తం 1540 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. నియామక పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో ఉండే అవకాశం ఉంది. పూర్తి నోటిఫికేషన్ ను సెప్టెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
ముఖ్య వివరాలు:
AEE Jobs Details: అసిట్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) సివిల్ పీఆర్ అండ్ ఆర్ డీ డిపార్ట్ మెంట్(మిషన్ భగీరథ) లో 302 పోస్టులు
ఏఈఈ సివిల్ విభాగం 211 పోస్టులు, ఏఈఈ సివిల్ ఎంఏ అండ్ యూడీ పీహెచ్ విభాగంలో 147 పోస్టులు
టీడబ్ల్యూ డిపార్ట్ మెంట్ లో 15, ఐ అండ్ సీడీ డిపార్ట్ మెంట్లో మొత్తం 704 ఖాళీలు (సివిల్ 320, మెకానికల్ 84, ఎలక్ట్రికల్ 200, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగంలో 100)
ఏఈఈ మెకానికల్ ఐ అండ్ సీఏడీ డిపార్ట్ మెంట్ లో 03, ఏఈఈ (సివిల్) టీఆర్ అండ్ బీ విభాగంలో 145 ఉద్యోగాలు
ఏఈఈ ఎలక్ట్రికల్ టీఆర్ అండ్ బీ విభాగంలో 13 పోస్టులు
అర్హతలు - సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ విభాగంలో ఇంజనీరింగ్/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి అర్హతులు ఉంటాయి.
వయోపరిమితి - అభ్యర్థుల యొక్క వయస్సు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం - నెలకు రూ.54220 నుంచి రూ. 1,33,630 మధ్య ఉంటుంది.
దరఖాస్తుల స్వీకరణ - సెప్టెంబర్ 22, 2022
తుది గడువు - 14, అకోబ్టర్, 2022
పరీక్ష - డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహించే అవకాశం