తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Old Pension Scheme : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి - టీఎస్‌సీపీఎస్‌ఈయూ

Old Pension Scheme : పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి - టీఎస్‌సీపీఎస్‌ఈయూ

13 August 2023, 7:07 IST

google News
    • TSCPSEU Meeting at Nampally: హైదరాబాద్ లోని నాంపల్లి గ్రౌండ్స్ వేదికగా తెలంగాణ స్టేట్‌ కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం ఎంప్లాయీస్‌ యూనియన్‌ (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) గొంతెత్తింది.సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ సభకు భారీగా ఉద్యోగులు హాజరయ్యారు.
సభకు హాజరైన ఉద్యోగులు
సభకు హాజరైన ఉద్యోగులు

సభకు హాజరైన ఉద్యోగులు

Restoration of Old Pension Scheme: సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ శనివారం టీఎస్‌సీపీఎస్‌ఈయూ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 54 సంఘాల ఉద్యోగులు మద్దతు తెలుపుతూ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో పాటు పొరుగు రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలు కూడా ఈ సభకు హాజరయ్యారు. ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కాకుండా పాత పెన్షన్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయులందరూ భారీ సంఖ్యలో 33 జిల్లాల నుండి తరలివచ్చారు.

ఈ సభను ఉద్దేశించి టీఎస్‌సీపీఎస్‌ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల పైగా సీపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు పాత పెన్షన్ లో ఉన్న ఉద్యోగ ఉపాధ్యాయుల ఏకైక అభ్యర్థన సీపీఎస్ రద్దు అని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికిప్పుడు సీపీయస్ విధానాన్ని రద్దు చేస్తే ప్రభుత్వానికి నయా పైసా భారం ఉండదన్నారు. 16,500 కోట్లు పెన్షన్ నిధి సమకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రద్దు చేస్తే.. ఈ పెన్షన్ నిధిని తిరిగి రాష్ట్రాలకు చెల్లించాలని డిమాండ్ చేస్తూ... అక్టోబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. పాత పెన్షన్ విధానంతోనే ఉద్యోగ కుటుంబాలకు సామాజిక భద్రత కల్పించబడుతుందన్నారు. సీపీఎస్ రద్దు విషయంలో సీఎం కేసీఆర్ పై సీపీఎస్ ఉద్యోగులు సంపూర్ణ నమ్మకంతో ఉన్నారని చెప్పారు. ఈ సమస్యలను సీఎంకు చేరవేయటలో అధికారులు సంఘ నాయకులు విఫలమయ్యారని.. అవకాశం ఇస్తే ప్రభుత్వానికి తమ సమస్యను వివరించుటకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

మహారాష్ట్ర సిపిఎస్ యూనియన్ అధ్యక్షులు విటేష్ ఖండేల్కర్ మాట్లాడుతూ... తెలంగాణలో సిపిఎస్ రద్దు పరిస్తే మహారాష్ట్ర లో ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాడే అవకాశం ఉంటుందని అన్నారు. అక్కడి ప్రభుత్వంపై కూడా ఒత్తిడి వస్తుందన్నారు. సీఎం కేసీఆర్ తప్పకుండా సానుకూలమైన నిర్ణయం తీసుకొని... పాత పెన్షన్ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని కోరారు. జార్ఖండ్ అధ్యక్షులు విక్రమ్ సింగ్ మాట్లాడుతూ... జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ తో సీఎం కేసీఆర్ కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఈ విషయంపై తమ ముఖ్యమంత్రి సోరెన్ ను... కేసీఆర్ తో చర్చలు జరిపేలా చేస్తామని తెలిపారు.

జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ బందు మాట్లాడుతూ... "ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు లక్షల సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు మీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని 84 లక్షల ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఎదురుచూస్తున్నారు. మీరు సిపిఎస్ ను రద్దు చేసి దేశ్ కి నేత కావాలి"అని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు పల్లెల రామాంజనేయులు మాట్లాడుతూ ... ఇటీవలే ఏపీ సర్కార్ ప్రకటించిన జిపిఎస్ విధానంకు సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు అందరూ కూడా వ్యతిరేకమని స్పష్టం చేశారు. పాత పెన్షన్ విధానమే ఉద్యోగులకు సామాజిక భద్రతను కల్పిస్తుందన్నారు.

తదుపరి వ్యాసం