తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Set 2024 : తెలంగాణ 'సెట్' అభ్యర్థులకు అలెర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల.. ఇదిగో లింక్

TG SET 2024 : తెలంగాణ 'సెట్' అభ్యర్థులకు అలెర్ట్.. నేడు హాల్ టికెట్లు విడుదల.. ఇదిగో లింక్

02 September 2024, 11:10 IST

google News
    • TG SET 2024 : తెలంగాణ సెట్ 2024 పరిక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ విడుదల కానున్నాయి. తెలంగాణ సెట్ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తెలంగాణ సెట్ 2024 కు సంబంధించి పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల మార్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో..
తెలంగాణ సెట్ హాల్ టికెట్స్ విడుదల
తెలంగాణ సెట్ హాల్ టికెట్స్ విడుదల

తెలంగాణ సెట్ హాల్ టికెట్స్ విడుదల

తెలంగాణ సెట్( 2024) పరీక్షలకు సంబంధించి సోమవారం అధికారులు హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. తెలంగాణ సెట్ అఫీషియల్ వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలి. అధికారిక వెబ్ సైట్ http://telanganaset.org/ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.

షెడ్యూల్ మారింది..

తెలంగాణ సెట్ ( 2024) పరీక్షల షెడ్యూల్‌ను ఇటీవల అధికారులు మార్చారు. యూజీసీ నెట్ పరీక్షల ఉన్న నేపథ్యంలో ముందుగా నిర్ణయించిన పరీక్షల షెడ్యూల్ తేదీలను మార్చారు. కొత్త తేదీలను ఇటీవలే ప్రకటించారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. దరఖాస్తుల ఎడిట్‌కు ఆగస్టు 23, 24వ తేదీ వరకు అవకాశం కల్పించారు. ఇక సెప్టెంబర్ 2వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. సెప్టెంబర్ 10, 11, 12, 13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఆగస్టు 28, 29, 30, 31వ తేదీల్లో పరీక్షలను జరపాలను నిర్ణయించారు. కానీ యూజీసీ నెట్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో.. కొత్త తేదీలను ప్రకటించారు.

తెలంగాణ సెట్‌ను రెండు పేపర్లలో నిర్వహించనున్నారు. పేప‌ర్-1 లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు ఉంటాయి. పేప‌ర్-2 లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో ఉండనున్నాయి. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ సెట్.. 11 ముఖ్యాంశాలు..

1.జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ -పేపర్-1 గా ఉంటుంది.

2.పేపర్ - 2 అనేది అభ్యర్థి పీజీ పూర్తి చేసిన సబ్జెక్టుపై రాసుకోవాల్సి ఉంటుంది.

3.ఇందులో జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టులు ఉంటాయి.

4.వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.

5.కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.

6.పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు.

7.పరీక్ష వ్యవధి మూడు గంటలు ఉంటుంది.

8.ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

9.ఈ పేపర్‌ 2 లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.

10.ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

11.తెలంగాణ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ : http://www.telanganaset.org/

తదుపరి వ్యాసం