తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Polycet 2024 Updates : తెలంగాణ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్‌ ఇదే

TS POLYCET 2024 Updates : తెలంగాణ పాలిసెట్ హాల్ టికెట్లు విడుదల - డౌన్లోడ్ లింక్‌ ఇదే

22 May 2024, 9:42 IST

google News
    • TS POLYCET Hall Tickets 2024 : తెలంగాణ పాలిసెట్ - 2024 హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రవేశ పరీక్ష మే 24వ తేదీన జరగనుంది. 
తెలంగాణ పాలిసెట్  - 2024
తెలంగాణ పాలిసెట్ - 2024

తెలంగాణ పాలిసెట్ - 2024

TS POLYCET Exam 2024 Updates : తెలంగాణ పాలిసెట్ - 2024 ఎంట్రెన్స్ పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మే 24వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష జరగనుంది. ఇందుకోసం ఏర్పాట్లను సిద్ధం చేశారు.

How to Download TS POLYCET Hall Tickets 2024 : టీఎస్ పాలిసెట్ హాల్ టికెట్లు ఇలా పొందండి….

  • తెలంగాణ పాలిసెట్ - 2024 కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://polycet.sbtet.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే HallTicket ఆప్షన్ పై నొక్కాలి. 
  • ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ అప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
  • ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.

పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం  పాలిసెట్ - 2024(TS POLYCET) ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ, ట్రైనింగ్ బోర్డు ఈ ఎగ్జామ్ ను చేపడుతుంది.

పాలీసెట్‌ 2024 ద్వారా పివి.నరసింహరావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ద్వారా నిర్వహించే పశుసంవర్థన - మత్స్య పరిశ్రమకు సంబంధించిన కోర్సులు( PVNRTVU), కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వ విద్యాలయం (SKLTSHU) అందించే ఉద్యానవన డిప్లొమా కోర్సులు, ప్రొఫెసర్ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ( PJTSAU) ద్వారా అందిస్తున్న వ్యవసాయ కోర్సులలో ప్రవేశాలు కల్పిస్తారు. వీటితో పాటు తెలంగాణ వ్యాప్తంగా పాలిటెక్నిక్ కాలేజీల్లో నిర్వహిస్తున్న కోర్సులు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్ పాలిటెక్నిక్‌ విద్యా సంస్థలు, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పాలీసెట్ 2024 నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

 పాలీసెట్ 2024 Polycet 2024 ద్వారా ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సుల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కల్పిస్తారు. పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రశేశ పరీక్ష - పాలీసెట్‌ 2024 ద్వారా విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పిస్తారు.

పాలిసెట్ - 2024 ఫలితాలు ఎప్పుడంటే…?

తెలంగాణ పాలిసెట్ పరీక్ష మే 24వ తేదీన  నిర్వహించనున్నారు.  పరీక్ష నిర్వహించిన 12 రోజుల్లో ఫలితాలను విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. దీంతో జూన్ మొదటి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా రానుంది. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.

పాలిసెట్‌ 2024పై ఏదైనా సందేహాలు ఉంటే 040-23222192 నంబరును సంప్రదించాలి. polycet-te@telangana.govi.inకు మెయిల్ కూడా చేయవచ్చని అధికారులు తెలిపారు.

నేటి నుంచి ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్….

AP Polycet Admissions: ఆంధ్రప్రదేశ్‌ పాలిసెట్ 2024 అడ్మిషన్ల ప్రక్రియ మే 23వ తేదీ నుంచి ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, సాంకేతిక విద్య, శిక్షణా మండలి ఛైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ ఇవాళే విడుదల కానుంది.

విద్యార్ధులు కోరుకున్న కోర్సులతో పాటు కాలేజీలకు సంబంధించిన ఆప్షన్లను నమోదు చేయడానికి మే 31వ తదీ నుండి జూన్ 5వ తేదీ వరకు అవకాశం కల్పించారు. జూన్ 5వ తేదీన విద్యార్ధులు తాము ఎంచుకున్న ఆప్షన్లను మార్చుకోడానికి అవకాశం ఉంటుందని , జూన్ 7వ తేదీన సీట్ల కేటాయింపును పూర్తి చేస్తామని కమీషనర్ వివరించారు.

తదుపరి వ్యాసం