TS ICET 2023: టీఎస్ ఐసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి
24 May 2023, 7:02 IST
- TS ICET Hall Ticket 2023: టీఎస్ ఐసెట్ - 2023 రాసే అభ్యర్థులకు కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు ప్రకటించారు.
తెలంగాణ ఐసెట్ - 2023
TS ICET Hall Ticket 2023 Updates: తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (టీఎస్ ఐసెట్) హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, వాటి అనుబంధ కాలేజీల్లో ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS ICET) నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షను మే 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా అడ్మిట్ కార్డ్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
మే 26, 27 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో ఐసెట్ - 2023 పరీక్ష ఉంటుంది. రోజుకు రెండు షిఫ్టుల ప్రకారం ఈ పరీక్ష నిర్వహిస్తారు. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ పరీక్షను నిర్వహిస్తోంది. ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా అడ్మిషన్లు ఇస్తారు.
ఇలా డౌన్లోడ్ చేసుకోవాలి...
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మొదటగా https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయగానే మీ అడ్మిట్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి అడ్మిట్ కాపీని పొందవచ్చు.
షెడ్యూల్ వివరాలు:
తెలంగాణ ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభమైంది.
మే 6వ తేదీలో దరఖాస్తుల గడువు ముగుసింది.
మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది.
జూన్ 5న ప్రాథమిక కీ విడుదల అవుతుంది.
ఆన్సర్ కీపై జూన్ 8న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను పంపవచ్చు.
జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల అవుతాయి.