TS ICET 2023: టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?-telangana icet 2023 notification released check full details are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Icet 2023: టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

TS ICET 2023: టీఎస్‌ ఐసెట్‌ షెడ్యూల్ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

HT Telugu Desk HT Telugu
Mar 01, 2023 01:54 PM IST

TS ICET 2023 Notification:తెలంగాణ ఐసెట్ 2023 నోటిఫికేషన్ వచ్చేసింది. విద్యాసంవత్సరం (2023–2024) ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను రాష్ట్ర ఉన్నత విద్యామండలి మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు పూర్తి వివరాలను వెల్లడించింది.

తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ 2023
తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ 2023

TS ICET 2023 Latest Updates: తెలంగాణలో ఒక్కొక్క ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్లు వచ్చేస్తున్నాయి. తాజాగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్-2023 షెడ్యూల్ కూడా విడుదలైంది. ఈ మేరకు కాకతీయ వర్శిటీ అధికారులతో కలిసి రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి విడుదల చేశారు. మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్రవేశపరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు వివరాలు పూర్తి వివరాలను వెల్లడించారు.

షెడ్యూల్ వివరాలు:

తెలంగాణ ఐసెట్-2023 దరఖాస్తు ప్రక్రియ మార్చి 6 నుంచి ప్రారంభం

మే 6వ తేదీలో దరఖాస్తుల గడువు ముగుస్తుంది.

రూ.250 ఆలస్య రుసుముతో మే 12 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో మే 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసుకునేందుకు మే 12 నుంచి 18 వరకు ఎడిట్ అవకాశం ఉంటుంది.

మే 22 నుంచి ఐసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 75 కేంద్రాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది.

జూన్ 5న ప్రాథమిక కీ విడుదల అవుతుంది.

ఆన్సర్ కీపై జూన్ 8న సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను పంపవచ్చు.

జూన్ 20న ఫైనల్ కీతో పాటు ఫలితాలను విడుదల అవుతాయి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల సమర్పణ, ఆన్‌లైన్‌ పరీక్ష, పరీక్ష కేంద్రాల జాబితా, మాక్‌ టెస్టుల, హాల్ టికెట్లు, ఫలితాలు విడుదలతో పాటు ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్ సైట్ https://tsicet.nic.in/ ను సందర్శించవచ్చు.

TS Lawcet, Ecet: మరోవైపు మార్చి 2వ తేదీ నుంచి లాసెట్, ఈసెట్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ రెండు ప్రవేశ పరీక్షల షెడ్యూలును ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి, ఓయూ వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ రవీందర్ విడుదల చేశారు. లాసెట్ నోటిఫికేషన్ మార్చి 1న విడుదల కానుంది. దరఖాస్తులను మార్చి 2 నుంచి ఏప్రిల్ 6 వరకు సమర్పించవచ్చు. ఆలస్య రుసుముతో ఏప్రిల్ 7 నుంచి మే 3 వరకు సమర్పించవచ్చు. అలాగే దరఖాస్తుల్లో తప్పుల సవరణ చేసుకునేందుకు మే 4 నుంచి 10 వరకు సమయం ఉంటుంది. హాల్‌టికెట్లను మే 16 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. లాసెట్ పరీక్ష మే 25న ఉంటుంది. లాసెట్ దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైన అభ్యర్థులు రూ. 600, ఇతరులు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.

ఈసెట్ నోటిఫికేషన్ మార్చి 1న విడుదల కానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు సమర్పించేందుకు మార్చి 2 నుంచి మే 2 వరకు సమయం ఉంటుంది. ఆలస్య రుసుముతో మే 3 నుంచి మే 12 వరకు గడువు ఉంది. దరఖాస్తుల్లో సవరణ చేసేందుకు మే 8 నుంచి మే 12 వరకు సమయం ఉంటుంది. హాల్ టికెట్లను మే 15 నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈసెట్ పరీక్ష మే 20న ఉంటుంది. ఈసెట్ దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే రూ. 500, ఇతరులు రూ. 900 చెల్లించాల్సి ఉంటుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం