TS EAMCET 2023 Schedule: ఎంసెట్ షెడ్యూల్ విడుదల...ఈసారి ఇంటర్ వెయిటేజీ లేదు-telangana eamcet 2023 schedule released check full details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet 2023 Schedule: ఎంసెట్ షెడ్యూల్ విడుదల...ఈసారి ఇంటర్ వెయిటేజీ లేదు

TS EAMCET 2023 Schedule: ఎంసెట్ షెడ్యూల్ విడుదల...ఈసారి ఇంటర్ వెయిటేజీ లేదు

HT Telugu Desk HT Telugu
Feb 24, 2023 01:04 PM IST

Telangana EAMCET 2023: తెలంగాణ ఎంసెట్ 2023 షెడ్యూల్ విడుదలైంది. మే 29 నుంచి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్నాయి. ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి వివరాలను వెల్లడించింది.

ఎంసెట్ షెడ్యూల్ విడుదల
ఎంసెట్ షెడ్యూల్ విడుదల

Telangana EAMCET 2023 Updates: ఎంసెట్ 2023కి సంబంధించిన షెడ్యూల్ ను విడుదల చేసింది తెలంగాణ ఉన్నత విద్యా మండలి. ఫిబ్రవరి 28వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. మార్చి 3 నుంచి ఆన్ లైన్ అప్లికేషన్స్ స్వీకరించనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10గా నిర్ణయించారు.

ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది. 250 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 15 వరకు అవకాశం ఉంటుంది. 500 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 20వ తేదీ, 2500 రూపాయల లేట్ ఫీజు తో 25 ఏప్రిల్ వరకు ఛాన్స్ ఉంటుంది. ఇక 5000 రూపాయల లేట్ ఫీజు తో మే 2వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ చేస్తారు. మే 7,8, 9 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలు నిర్వహిస్తారు.ఈసారి ఇంటర్ వెయిటేజీ లేదని విద్యా మండలి స్పష్టం చేసింది.

ముఖ్య వివరాలు:

ఫిబ్రవరి 28న నోటిఫికేషన్ విడుదల.

మార్చి 3 నుండి ఆన్లైన్ అప్లికేషన్స్ స్వీకరణ.

ఆన్లైన్ అప్లికేషన్ స్వీకరణకి చివరి తేదీ ఏప్రిల్ 10.

ఏప్రిల్ 12 నుండి 14 వరకు ఎడిట్ చేసుకునే అవకాశం.

ఏప్రిల్ 30 నుండి ఆన్లైన్ లో ఎంసెట్ హల్ టికెట్స్ జారీ.

మే 29 నుండి జూన్ 1 వరకు ఎంసెట్ పరీక్షలు

మే 7,8, 9 తేదీల్లో ఇంజినీరింగ్ పరీక్షలు.

మే 10,11న అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షలు.

ఉదయం 9 నుండి 12 వరకు మొదటి సెషన్ పరీక్ష, మధ్యాహ్నం 3 నుండి 6 వరకు రెండవ సెషన్ పరీక్ష ఉంటుంది.

ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 500 రూపాయలు.

ఇతర విద్యార్థులకు ఎంసెట్ ఫీజు 900 రూపాయలు.

ఈసారి ఎంసెట్ ద్వారా నే బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్

ఈసారి ఎంసెట్ లో ఇంటర్ వెయిటేజీ లేదు

45 Percent inter marks rule to EAMCET: ఎంసెట్ పరీక్ష విషయంలో తెలంగాణ ఉన్నత విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఎంసెట్‌కు హాజరయ్యేందుకు ఇంటర్‌లో 45 శాతం మార్కులు తప్పక ఉండాలన్న నిబంధనను ఈ ఏడాది పునరుద్ధరించింది. నిర్దిష్ట మార్కులు సాధించిన వారే ఎంసెట్‌ రాసే అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. నిజానికి ఈ నిబంధన ఉన్నప్పటికీ... కరోనా కారణంగా 2021, 2022 విద్యాసంవత్సార్లో ఈ నిబంధన అమలు చేయలేదు. కానీ ఈ ఏడాది వంద శాతం సిలబస్ తో ఇంటర్ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో... 45 శాతం మార్కుల నిబంధనను తిరిగి పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. జనరల్‌ క్యాటగిరీ విద్యార్థులు ఇంటర్‌ గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీల్లో 45 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక రిజర్వేషన్‌ క్యాటగిరీ వారికి 40 శాతం మార్కులు తప్పనిసరి.

IPL_Entry_Point

సంబంధిత కథనం