తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Treirb Exams : ఆగస్టు 1 నుంచి గురుకుల ఉద్యోగ పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు

TREIRB Exams : ఆగస్టు 1 నుంచి గురుకుల ఉద్యోగ పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు

30 July 2023, 7:00 IST

google News
    • TS Gurukulam Exam Dates: ఆగస్టు 1వ తేదీ నుంచి గురుకులం ఉద్యోగ రాత పరీక్షలు జరగనున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజు 3 షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నారు.
గురుకులం పరీక్ష తేదీలు
గురుకులం పరీక్ష తేదీలు

గురుకులం పరీక్ష తేదీలు

TS Gurukulam Exam Dates 2023: గురుకుల రాత పరీక్షలకు ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. 9,210 ఉద్యోగాల‌కు ఆగస్టు 1వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించ‌నున్నారు. మొత్తం 19 రోజల పాటు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్‌టికెట్లల‌ను https://treirb.telangana.gov.in/ వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక అభ్యర్థులు పాటించాల్సిన సూచనలను కూడా పేర్కొంది రిక్రూట్ మెంట్ బోర్డు.

సూచనలివే:

- ప్రతి రోజు 3 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహిస్తారు.

- పరీక్షకు 15 నిమిషాల ముందు గేట్లు మూసివేస్తాం. ఆ తరువాత ఎట్టిపరిస్థితుల్లోనూ అభ్యర్థులను పరీక్ష గదుల్లోకి అనుమతించరు.

- ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లిన తరువాత పరీక్ష ముగిసేవరకు కేంద్రం నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతి లేదు.

-అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఒక గుర్తింపు కార్డు తప్పనిసరి తీసుకురావాలి.

-హాల్‌టికెట్‌పై ఫొటో ప్రింట్‌ కాకుంటే మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలపై గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరణ, అండర్‌టేకింగ్‌ ధ్రువీకరణ పత్రం తీసుకుని ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి.

-ఎలక్ట్రానిక్‌ పరికరాలు, వాచ్ లు, ఇతర నిషేధిత వస్తువులను ఎగ్జామ్ కేంద్రంలోకి తీసుకెళ్లకూడదు. అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. బూట్లతో రావొద్దు.

- కంప్యూటర్‌ అధారిత పరీక్ష (CBT)ను నిర్వహించనున్నారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే కంప్యూటర్‌ ఆటోమేటెడ్‌గా అదనపు సమయం ఇస్తుంది.

హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే...

-అభ్యర్థులు ముందుగా https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

-హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

-గురుకుల బోర్డు వెబ్‌సైట్లో లాగిన్‌ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్‌టికెట్లు కనిపిస్తాయి.

-మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేయాలి.

-డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై నొక్కాలి. మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.

-ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.

-ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లేందుకు హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్తులో కూడా చాలా అవసరం ఉంది.

ఆగస్టు 1 నుంచి 24 వరకు జరిగే ఈ రాత పరీక్షలు మొత్తం మూడు షిఫ్టులో ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు; రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు; మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. గురుకుల పోస్టులకు పేపర్‌ 1 పరీక్షలు అగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. ఇక ఆగస్టు 1 నుంచి 7 వరకు జేఎల్‌, డీఎల్‌, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్స్‌, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, మ్యూజిక్‌ టీచర్‌ పేపర్‌ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.

భర్తీ చేసే పోస్టుల వివరాలు :

జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, పీడీ - 2008

డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ - 868

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) -1276

ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4020

లైబ్రేరియ‌న్ స్కూల్- 434

పీజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ - 275

డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ -134

క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్- 92

మ్యూజిక్ టీచ‌ర్స్- 124

రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్‌టీ)గా నిర్వహించనుంది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పేపర్లు లీక్ కావటంతో… అలాంటి ఘటనలకు అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపడుతోంది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని చూస్తోంది.

-

తదుపరి వ్యాసం