TS Gurukulam : తెలంగాణ గురుకుల ఉద్యోగాల హాల్టికెట్లు విడుదల - డౌన్లోడ్ ప్రాసెస్ ఇదే
TREIRB Hall Tickets: గురుకులం ఉద్యోగ రాత పరీక్ష హాల్ టికెట్లు వచ్చేశాయ్. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://treirb.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి… డౌన్లోడ్ చేసుకోవచ్చు.
TS Gurukulam Hall Tickets: గురుకుల రాత పరీక్షలకు సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది రిక్రూట్ మెంట్ బోర్డు. పలు రాత పరీక్షల హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. 9,210 ఉద్యోగాలకు ఆగస్టు 1వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు. 18 రోజల పాటు జరిగే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు విడుదలయ్యాయి. ఈ హాల్టికెట్లలను https://treirb.telangana.gov.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ప్రాసెస్ ఇదే...
-అభ్యర్థులు ముందుగా https://treirb.telangana.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
-హాల్ టికెట్లు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-గురుకుల బోర్డు వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు దరఖాస్తు చేసిన సబ్జెక్టుల పోస్టుల హాల్టికెట్లు కనిపిస్తాయి.
-మీ లాగిన్ వివరాలను ఎంట్రీ చేయాలి.
-డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ పై నొక్కాలి. మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
-ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
-ఎగ్జామ్ హాల్ లోకి వెళ్లేందుకు హాల్ టికెట్ తప్పనిసరి. భవిష్యత్తులో కూడా చాలా అవసరం ఉంది.
ఆగస్టు 1 నుంచి పరీక్షలు...
ఆగస్టు 1 నుంచి 23 వరకు జరిగే ఈ రాత పరీక్షలు మొత్తం మూడు షిఫ్టులో ఉంటాయి. మొదటి షిఫ్టు పరీక్ష 8.30 నుంచి 10.30 గంటలు; రెండో షిఫ్టు పరీక్ష 12.30 నుంచి 2.30 గంటలు; మూడో షిఫ్టు పరీక్ష 4.30 నుంచి 6.30 గంటల వరకు ఉంటుంది. గురుకుల పోస్టులకు పేపర్ 1 పరీక్షలు అగస్టు 10, 11, 12 తేదీల్లో ఉంటాయి. ఇక ఆగస్టు 1 నుంచి 7 వరకు జేఎల్, డీఎల్, పీజీటీ, టీజీటీ, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పేపర్ 2 పరీక్షలు నిర్వహించనున్నారు.
పోస్టుల వివరాలు :
జూనియర్ లెక్చరర్, లైబ్రేరియన్, పీడీ - 2008
డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్ - 868
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) -1276
ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (టీజీటీ) 4020
లైబ్రేరియన్ స్కూల్- 434
పీజికల్ డైరెక్టర్స్ ఇన్ స్కూల్ - 275
డ్రాయింగ్ టీచర్స్ ఆర్ట్ టీచర్స్ -134
క్రాఫ్ట్ ఇన్స్ట్రక్టర్ క్రాఫ్ట్ టీచర్స్- 92
మ్యూజిక్ టీచర్స్- 124
రాతపరీక్షలను కంప్యూటర్ ఆధారితంగా(సీబీఆర్టీ)గా నిర్వహించనుంది గురుకుల రిక్రూట్ మెంట్ బోర్డు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పేపర్లు లీక్ కావటంతో… అలాంటి ఘటనలకు అవకాశం లేకుండా గట్టి చర్యలు చేపడుతోంది. పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా పరీక్షలు పూర్తి చేసి ఫలితాలను విడుదల చేయాలని చూస్తోంది.
సంబంధిత కథనం