తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet Results 2023 Live: తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
టీఎస్ ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి

TS Eamcet Results 2023 live: తెలంగాణ ఎంసెట్ రిజల్ట్స్ విడుదల

25 May 2023, 10:37 IST

  • TS Eamcet Results 2023 live: ఇవాళ తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు.

25 May 2023, 10:37 IST

టీఎస్ ఎంసెట్‌లో ఏపీ విద్యార్థులకే టాప్ ర్యాంకులు

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులే టాప్ ర్యాంకులు సాధించారు. అగ్రికల్చర్ విభాగంలో తొలి 10 ర్యాంకుల్లో ఏడుగురు ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులే. ఇక ఇంజినీరింగ్ విభాగం తొలి 10 ర్యాంకుల్లో 8 మంది ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థులే.

25 May 2023, 10:31 IST

Eamcet Results 2023: ఎంసెట్ 2023 టాపర్స్ వీరే….

ఇంజినీరింగ్‌లో అనిరుధ్‌కు మొదటి ర్యాంకు, వెంకట మణిందర్‌రెడ్డికి రెండో ర్యాంకు దక్కింది. ఉమేశ్‌కు మూడో ర్యాంకు, అభినిత్ -4, ప్రమోద్ కుమార్ రెడ్డి 5, ధీరజ్ కుమార్ -6, శన్వితా రెడ్డి -7, సంజనకు 8వ ర్యాంక్ దక్కింది. ఇక అగ్రికల్చర్ విభాగంలో జశ్వంత్ కు మొదటి ర్యాంక్, వెంకటతేజకి రెండో ర్యాంక్, లక్ష్మి పసుపులాటి మూడో ర్యాంక్ రాగా.. కార్తికేయ రెడ్డికి నాలుగో ర్యాంక్ దక్కింది.

25 May 2023, 10:03 IST

టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లాలి.

హాల్ టికెట్ నంబర్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు. ఇక ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in / లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.

25 May 2023, 9:54 IST

TS Eamcet Results 2023 live: టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ సీడీ విడుదల చేసిన మంత్రి సబితా ఇంద్రా రెడ్డి

TS Eamcet Results 2023 live: టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ సీడీని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేశారు. పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు ఎంసెట్ కన్వీనర్‌ను, యంత్రాంగాన్ని అభినందించారు. గతంలో కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిపారు. 104 సెంటర్లు ఏపీలో, 33 సెంటర్లు ఏపీలో ఏర్పాటు చేసి విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. అగ్రికల్చర్, ఫార్మసీ కలిపి సుమారు 1.05 లక్షల మంది రాసినట్టు వివరించారు. 86 శాతం అర్హత సాధించినట్టు తెలిపారు. ఇంజినీరింగ్‌లో 80 శాతం అర్హత సాధించారని తెలిపారు. ఇంజినీరింగ్‌లో అబ్బాయిలు 79 శాతం, అమ్మాయిల్లో 82 శాతం ఉత్తీర్ణత సాధించారు. 

25 May 2023, 9:42 IST

టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ ఇవే

విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లాలి.

హాల్ టికెట్ నంబర్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు. ఇక ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in / లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.

25 May 2023, 9:40 IST

ఫలితాలు విడుదల చేయనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్ రిజల్ట్స్ కాసేపట్లో మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేయనున్నారు. ఇప్పుడే విలేకరుల సమావేశం ప్రారంభమైంది.

25 May 2023, 9:08 IST

TS Eamcet results 2023 Live: 9.30కు ఫలితాల విడుదల

టీఎస్ ఎంసెట్ రిజల్ట్స్ 2023 ఫలితాలు 9.30 గంటలకు విడుదలవుతాయి. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల సీడీని 9.30కు విడుదల చేస్తారు. పాస్‌వర్డ్‌ను ఉదయం 9.45 గంటలకు ప్రకటిస్తారు. అంటే ఫలితాలు వెబ్‌సైట్లలో ప్రత్యక్షమవడానికి మరో 5 నిమిషాలు పడుతుంది. అంట 9.50 గంటలకు ఫలితాలు అందుబాటులోకి వస్తాయి. 

25 May 2023, 9:03 IST

టీఎస్ ఎంసెట్‌కు 3.20 లక్షల దరఖాస్తులు

టీఎస్ ఎంసెట్ 2023 ప్రవేశ పరీక్షకు మొత్తం 3.20 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మే 10, 11 తేదీల్లో అగ్రికల్చర్ స్ట్రీమ్, మే 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించారు.

25 May 2023, 8:41 IST

TS Eamcet Result links: ఫలితాలు లభ్యమయ్యే డైరెక్ట్ లింక్స్ ఇవే

విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana/results లోకి వెళ్లాలి.

హాల్ టికెట్ నంబర్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు. ఇక ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in / లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు. రిజల్ట్స్ లైవ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు ఇంగ్లీషులో తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి.

25 May 2023, 8:27 IST

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కోర్సులకు డిమాండ్

గత ఏడాది కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ తదితర కోర్సులకు బాగా డిమాండ్ కనిపించింది.

25 May 2023, 8:26 IST

45 వేల సీట్లు కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే భర్తీ

గత ఏడాది కన్వీనర్ కోటాలో 62 వేల సీట్లు భర్తీ కాగా, వీటిలో సుమారు 45 వేల సీట్లు కంప్యూటర్ కోర్సులకు సంబంధించినవే. ఇక ఈసీఈ బ్రాంచిలో 10,789 సీట్లు, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 1,249 మంది, సివిల్‌లో 1683 మంది అడ్మిషన్లు తీసుకున్నారు.

25 May 2023, 8:24 IST

కంప్యూటర్ కోర్సులకే డిమాండ్

ఎంసెట్ ద్వారా భర్తీ అవుతున్న అడ్మిషన్లలో కంప్యూటర్ కోర్సులకు, ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఐటీ కోర్సులకు బాగా డిమాండ్ ఉంది. ఈనేపథ్యంలో కళాశాలలు సివిల్, మెకానికల్ కోర్సుల్లో సీట్లను తగ్గించుకుని కంప్యూటర్ కోర్సు సీట్లను పెంచుకుంటున్నాయి. గత ఏడాది 10 వేల సీట్లను ఇలాగే పెంచుకున్నాయి.

25 May 2023, 8:19 IST

గత ఏడాది ఇంజినీరింగ్‌లో చేరిన 80 వేల మంది విద్యార్థులు

2022-23 విద్యా సంవత్సరంలో మొత్తం 177 కళాశాలల్లో 1.10 లక్షల సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. కానీ మేనేజ్మెంట్, కన్వీనర్ కోటాలో కలిపి మొత్తం 80 వేల సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.  61,972 సీట్లు మాత్రమే కన్వీనర్ కోటాలో భర్తీ అయ్యాయి.

25 May 2023, 8:04 IST

మరికాసేపట్లో ఫలితాలు

మరికాసేపట్లో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

25 May 2023, 6:50 IST

ఈ లింక్ తో చెక్ చేసుకోండి

https://telugu.hindustantimes.com/telangana/results లింక్ తో తెలంగాణ ఎంసెట్ ఫలితాలను వేగంగా, సింపుల్ గా తెలుసుకోవచ్చు.

25 May 2023, 6:27 IST

HT తెలుగులో ఇలా చెక్ చేసుకోండి..

విద్యార్థులు డైరెక్ట్‌గా హిందుస్తాన్ టైమ్స్ తెలుగు వెబ్‌సైట్ https://telugu.hindustantimes.com/telangana/results  లోకి వెళ్లాలి.

హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయగానే.. మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ లేదా డ్లౌనోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

25 May 2023, 6:27 IST

విద్యార్థుల సంఖ్య…

ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్(EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు

25 May 2023, 6:26 IST

లింక్స్

ఫలితాల విడుదల సమయంలోనే ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఫలితాలను హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ద్వారా సింపుల్ గా తెలుసుకోవచ్చు. ఇక ఎంసెట్ అధికారిక వెబ్ సైట్ https://eamcet.tsche.ac.in / లో కూడా ఫలితాలను చూసుకోవచ్చు.

25 May 2023, 6:26 IST

నేడే ఫలితాలు

ఇవాళ తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. రిజల్ట్స్ డైరెక్ట్ లింక్స్ కోసం ఇక్కడ చూడండి

24 May 2023, 20:41 IST

మే 10 నుంచి 15 వరకు ఎంసెట్ పరీక్షలు నిర్వహణ

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాలకు, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు పరీక్షలను నిర్వహించారు. ఇటీవలే అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. అన్నింటిని క్రోడీకరించిన అధికారులు మే 25న ఫలితాలను విడుదల చేయనున్నారు.

24 May 2023, 19:35 IST

హెచ్.టి తెలుగులో తెలంగాణ ఎంసెట్ ఫలితాలు

హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో టీఎస్ ఎంసెట్ ఫలితాలు చాలా వేగంగా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/ లోకి వెళ్లి ఎంసెట్ ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. అనంతరం మీ రూల్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుంది.

24 May 2023, 18:59 IST

టాప్ టెన్ ర్యాంకులు ప్రకటించనున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ఎంసెట్ అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్, ఇంజినీరింగ్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాలు ర్యాంకుల‌ను, మార్కుల‌ను రేపు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫలితాలను ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా తెలుసుకోవ‌చ్చు. మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్, ఇంజినీరింగ్ టాప్ పది ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను మే 25న వెల్లడించ‌నున్నారు. ఎంసెట్ ఫ‌లితాల కోసం https://telugu.hindustantimes.com/, https://eamcet.tsche.ac.in/ అనే వెబ్‌సైట్‌ లో చెక్ చేసుకోవచ్చు.

24 May 2023, 18:33 IST

ఫలితాల షెడ్యూల్ లో స్వల్ప మార్పులు

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. ఫలితాలకు సంబంధించిన షెడ్యూల్‌లో ఎంసెట్ కన్వీనర్ స్వల్ప మార్పులు చేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ అగ్రికల్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీలో గురువారం ఉదయం 9.30 గంటలకు ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు.

24 May 2023, 16:28 IST

రేపు ఉదయం 9.30 గంటలకే ఎంసెట్ ఫలితాలు

రేపు ఉదయం 9:30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. సీఎం కేసీఆర్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ కారణంగా ఫలితాల సమయంలో మార్పులు చోటుచేసుకున్నాయి. 

24 May 2023, 16:13 IST

తెలంగాణ ఎంసెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

Step 1 : ముందుగా అభ్యర్థులు //https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి

Step 2 : హోం పేజీలో టీఎస్ ఈసెట్ రిజల్ట్స్ 2022 సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.

Step 3 : అప్పుడు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి

Step 4 : మీ రిజల్ట్ స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది. ఫలితాల కాపీని డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకోని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి

24 May 2023, 13:41 IST

రేపు ఎంసెట్ ర్యాంకులు, మార్కులు విడుదల

ఎంసెట్ ఇంజినీరింగ్, అగ్రిక‌ల్చర్, మెడిక‌ల్ కోర్సుల‌కు సంబంధించిన ఫ‌లితాల ర్యాంకుల‌ను, మార్కుల‌ను గురువారం విడుదల చేయనున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ నంబ‌ర్ ద్వారా ఫ‌లితాల‌ను చెక్ చేసుకోవచ్చు. మెడిక‌ల్, అగ్రిక‌ల్చర్, ఇంజినీరింగ్ టాప్ టెన్ ర్యాంక‌ర్ల వివ‌రాల‌ను రేపు వెల్లడించ‌నున్నారు. ఎంసెట్ ఫ‌లితాల కోసం eamcet.tsche.ac.in వెబ్‌సైట్లో లాగిన్ అవొచ్చు.

24 May 2023, 13:11 IST

3 రోజులపాటు పరీక్షలు….

మే 12 నుంచి మూడు రోజుల పాటు ఆరు విడతల్లో ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించారు. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను అధికారిక https://eamcet.tsche.ac.in/ వెబ్ సైట్ లో ఉంచారు.  ప్రైమరీ కీపై మే 17వ తేదీ రాత్రి 8 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరించారు. వీటన్నింటిని సరిచూసిన తర్వాత మే 25వ తేదీన ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించారు.

24 May 2023, 12:53 IST

ఏపీ ఎంసెట్ కీ విడుదల

మరోవైపు ఏపీ ఎంసెట్ విద్యార్థులకు కీలక అలర్ట్ ఇచ్చారు అధికారులు. ఇంజినీరింగ్ తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక 'కీ' లను విడుదల చేశారు. అభ్యంతరాలుంటే 26వ తేదీ ఉదయం 9లోపు తెలపాలని సూచించారు. ఈ మేరకు ఈఏపీసెట్ ఛైర్మన్‌ రంగజనార్దన్ ఓ ప్రకటనలో తెలిపారు.

24 May 2023, 12:08 IST

ప్రాసెస్ ఇదే…

https://tseamcet.nic.in  అభ్యర్థులు మొదటగా ఈ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

ఎంసెట్ ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.

మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి.

సబ్మిట్ బటన్ నొక్కటంతో మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.

ప్రింట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.

అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు ఎంతో కీలకం

24 May 2023, 11:45 IST

విడుదల చేయనున్న మంత్రి

మే 25న ఉదయం 11 గంటలకు కూక‌ట్‌ప‌ల్లిలోని జేఎన్‌టీయూ క్యాంప‌స్‌లోని గోల్డెన్ జూబ్లీ సెమినార్ హాల్‌లో ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు.ఎంసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా రిలీజ్ చేస్తారు.

24 May 2023, 9:30 IST

ఉదయం 11 గంటలకు

మే 10, 11 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, మెడికల్‌ విభాగాలకు, మే 12 నుంచి 15వరకు ఆరు విడతల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌కు పరీక్షలను నిర్వహించారు. ఇటీవలే అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ ప్రాథమిక కీ, రెస్పాన్స్‌ షీట్లను విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరించారు. అన్నింటిని క్రోడీకరించిన అధికారులు రేపు ఫలితాలను విడుదల చేయనున్నారు.

24 May 2023, 7:59 IST

హెచ్ టీ తెలుగులో ఎంసెట్ ఫలితాలు

హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో టీఎస్ ఎంసెట్ ఫలితాలు చాలా వేగంగా,సింపుల్ గా తెలుసుకోవచ్చు. https://telugu.hindustantimes.com/ లోకి వెళ్లి ఎంసెట్ ఫలితాలు అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీ రూల్ నెంబర్ ఎంట్రీ చేస్తే మీ ర్యాంక్ డిస్ ప్లే అవుతుందియ

24 May 2023, 7:12 IST

లింక్స్ ఇవే

https://eamcet.tsche.ac.in/ లింక్ తో పాటు https://telugu.hindustantimes.com/telangana/results ద్వారా తెలంగాణ ఎంసెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

24 May 2023, 6:17 IST

వెబ్ సైట్ లో రెస్పాన్స్ షీట్లు

అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ టెస్ట్‌ల ప్రిలిమినరీ 'కీ'లపై విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించారు. దీని తరువాత, తుది కీ రూపొందించారు. మొత్తం ఐదు రోజుల పాటు పలు సెషన్ లలో నిర్వహించిన పరీక్షలు కాబట్టి ఫలితాల వెల్లడించడానికి కాస్త సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఎంసెట్ ఫలితాలు మే 25న ప్రకటించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్(EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

24 May 2023, 6:16 IST

రేపే ఎంసెట్ ఫలితాలు

రేపు తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను రిలీజ్ చేస్తారు. దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

23 May 2023, 22:01 IST

3 లక్షల మందికి పైగా పరీక్షకు హాజరు

అగ్రికల్చర్, మెడికల్, ఇంజినీరింగ్ స్ట్రీమ్ టెస్ట్‌ల ప్రిలిమినరీ 'కీ'లపై విద్యార్థులు లేవనెత్తిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించారు. దీని తరువాత, తుది కీ రూపొందించారు. మొత్తం ఐదు రోజుల పాటు పలు సెషన్ లలో నిర్వహించిన పరీక్షలు కాబట్టి ఫలితాల వెల్లడించడానికి కాస్త సమయం పట్టిందని అధికారులు తెలిపారు. ఎంసెట్ ఫలితాలు మే 25న ప్రకటించనున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ ఏడాది తెలంగాణ ఎంసెట్(EAMCET) పరీక్షలకు మొత్తం 94.11 శాతం విద్యార్థులు హాజరయ్యారని ఎంసెట్ కన్వీనర్ తెలిపారు. ఈ ఏడాది మొత్తం 3,20,683 దరఖాస్తులు రాగా, వీటిలో 3,01,789 మంది విద్యార్థలు పరీక్షలు రాశారు. వీరిలో తెలంగాణ నుంచి 2,48,279 మంది దరఖాస్తు చేసుకోగా 2,35,918 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఏపీ నుంచి 72,204 మంది దరఖాస్తు చేసుకోగా... వీరిలో 65,871 మంది మాత్రమే పరీక్షలు రాశారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు ఇప్పటికే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

23 May 2023, 20:52 IST

ఈ నెల 25న ఉదయం 11 గంటలకు రిజల్ట్స్ 

తెలంగాణ ఎంసెట్‌ ఇంజినీరింగ్ పరీక్షను తెలుగు రాష్ట్రాలలో దాదాపు 2 లక్షల మంది రాశారు. అగ్రికల్చర్‌ అండ్‌ మెడికల్‌ పరీక్షను దాదాపు లక్ష మందికి పైగా విద్యార్థులు రాశారు. 25న ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఫలితాలను విడుదల చేస్తారు.

23 May 2023, 17:23 IST

TS Eamcet Results 2023 live: ఫలితాలు ఈ వెబ్‌సైట్లలో

ఈనెల 25న ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఫలితాలు ఈ కింది వెబ్‌సైట్ లింక్స్‌లో లభ్యమవుతాయి. ఈ లింక్స్ నేరుగా మీ ఫలితాలు తెలుసుకోవచ్చు.

https://telugu.hindustantimes.com/telangana/results

https://eamcet.tsche.ac.in/ 

23 May 2023, 17:23 IST

ఇంజినీరింగ్, అగ్రికల్చర్ స్ట్రీమ్స్ రెండింటి ఫలితాల విడుదల

ఈనెల 25న ఎంసెట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇందులో ఇంజినీరింగ్, అగ్రికల్చర్ రెండు స్ట్రీమ్స్ ఫలితాలు వెల్లడి చేస్తారు.

23 May 2023, 17:23 IST

టీఎస్ ఎంసెట్ ఫలితాలపై అధికారిక ప్రకటన విడుదల

ఈ నెల 25వ తేదీన తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. 25న ఉదయం 11 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ కార్యదర్శి (ఉన్నత విద్య) వి.కరుణ, కళాశాల, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి, జేఎన్‌టీయూ హైదరాబాద్‌ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నరసింహారెడ్డి తదితరులు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. జేఎన్‌టీయూ హైదరాబాద్‌లోని గోల్డెన్‌ జూబ్లీ హాలులో ఈ ఫలితాలను విడుదల చేస్తారు.

    ఆర్టికల్ షేర్ చేయండి