తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Trs: జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన అప్పుడేనట….!

TRS: జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన అప్పుడేనట….!

HT Telugu Desk HT Telugu

26 June 2022, 5:39 IST

    • జాతీయ పార్టీ ప్రకటనకు సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు గూలాబీ బాస్ కేసీఆర్. ప్రస్తుత సమయం సరికాదని... రాష్ట్రపతి ఎన్నికల తర్వాత ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో) (twitter)

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (ఫైల్ ఫొటో)

KCR New Party: గత కొద్దిరోజులుగా దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలనుకున్నారు కేసీఆర్...! దేశవ్యాప్త పర్యటనకు కూడా వెళ్లిన ఆయన.. త్వరలోనే జాతీయ పార్టీపై కూడా ప్రకటన చేసేందుకు దాదాపు సిద్ధమయ్యారు. ఇంతలోనే రాష్ట్రపతి ఎన్నికల రావటం... ఎవరికీ మద్దతు ఇవ్వాలనే దానిపై బిజీబిజీ అయిపోయారు. అయితే పార్టీ ప్రకటనకు ప్రస్తుతం సమయం సరికాదని భావిస్తున్న గూలాబీ బాస్ కేసీఆర్... త్వరలోనే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

ప్రెసిడెంట్ ఎన్నికల తర్వాతే....

త్వరలోనే జాతీయ పార్టీని ప్రకటిస్తారని అనుకున్నప్పటికీ.. రాష్ట్రపతి ఎన్నికలు రావటంతో కేసీఆర్ వెనక్కి తగ్గారని సమాచారం. రాష్ట్రపతి ఎన్నికల తర్వాతే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్రపతి ఎన్నికలకు ఇంకా మూడు వారాలకుపైగా గడువు ఉన్నందున అప్పటి వరకు కొత్త పార్టీకి సంబంధించిన కసరత్తు కొనసాగించాలని ఆయన నిర్ణయించినట్లు పార్టీ వర్గాల మేరకు తెలుస్తోంది.

సుదీర్ఘ చర్చలు...

ఇక జాతీయ పార్టీ ఏర్పాటుపై కూడా కేసీఆర్... పలు వర్గాల మేథావులు, ఆర్థికవేత్తలు, సీనియర్ జర్నలిస్ట్ లతోనూ చర్చలు జరుపుతున్నారు. వారి నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెల 10న ప్రగతిభవన్‌లో శాసనసభాపతి, మండలి ఛైర్మన్‌, మంత్రులు, పార్టీ లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు, శాసనసభ, మండలి పార్టీ విప్‌లతోనూ ఓ కీలక భేటీని కూడా ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై చర్చించారు.

ప్రగతి భవన్ వేదికగా రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడా కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. గురువారం కూడా ప్రగతి భవన్‌లో ఢిల్లీకి చెందిన ఆర్థిక నిపుణుల బృందంతో ఆయన చర్చలు జరిపారు. శుక్రవారం జాతీయ మీడియా ప్రముఖులతోనూ భేటీ అయ్యారు. ఇలా పలు రంగాలకు చెందిన నిపుణులతో సీఎం కేసీఆర్ సమాలోచనలు చేస్తున్నారు. వచ్చే నెల రెండో వారం వరకు ఈ తరహా చర్చలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. పూర్తి స్థాయి కసరత్తు తర్వాతే జాతీయ పార్టీ ప్రకటనపై కేసీఆర్ ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రపతి ఎన్నికల్లోనూ విపక్షాల అభ్యర్థికి మద్దతుపై కూడా టీఆర్ఎస్ అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు. దీనిపై కూడా రేపోమాపో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ సీరియస్ గానే చర్చలు కొనసాగిస్తుండటం ఆసక్తిని రేపుతోంది. ఇక పార్టీ పేరు బీఆర్ఎస్ గానే ఉంటుందా..? లేక మార్చుతారా..? విధివిధానాలు ఏంటి..? బీఆర్ఎస్ గా మారితే టీఆర్ఎస్ పేరు ఉంటుందా..? వంటి ప్రశ్నలపై రాజకీయవర్గాల్లో ఇప్పటికే జోరుగా చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ చేసే ప్రకటనపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది..!

టాపిక్