తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy: నక్సలైట్ల అజెండా అన్న Kcrను ఎలా సమర్థించారు..?

Revanth Reddy: నక్సలైట్ల అజెండా అన్న KCRను ఎలా సమర్థించారు..?

HT Telugu Desk HT Telugu

08 February 2023, 18:26 IST

    • Revanth Reddy Controversy Comments issue: ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ చేసిన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు.తెలంగాణ ప్రజల ఆలోచననే తాను చెప్పానని... హింసకు తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి (twitter)

రేవంత్ రెడ్డి

Revanth Reddy Controversy Comments On Pragathi Bhavan: ప్రగతి భవన్ తెలంగాణ ప్రజల సొమ్ముతో కట్టిందన్నారు టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పాదయాత్రలో భాగంగా బుధవారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన... ప్రగతి భవన్ ముఖ్యమంత్రి అధికారిక నివాసం కాదన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించడానికే ప్రగతి భవన్ ఉండాలని... గతంలో చంద్రబాబు, వైఎస్ ప్రజలను కలవలేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఎందుకు? అని నిలదీశారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

"తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి గేట్లు బద్దలు కొడదామని ప్రజలకు పిలుపునిస్తున్నా. అవసరమైతే ప్రగతి భవన్ ను నేలమట్టం చేసే బాధ్యత మేం తీసుకుంటాం. నక్సలైట్ల ఎజెండా నా ఎజెండా అన్న కేసీఆర్ ను ఎలా సమర్దించారు.? ఇప్పుడు నేను మాట్లాడితే ఎందుకు తప్పుపడుతున్నారు..?తెలంగాణ ద్రోహులకు, తన బంధువులకు మంత్రి పదవులు ఇవ్వాలని నక్సలైట్ల ఎజెండాలో ఉందా? తెలంగాణ ప్రజల ఆలోచననే నేను చెప్పా. నిరంకుశ పాలన నుంచి శాశ్వత పరిష్కారం కోసం తుది దశ ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మా యాత్ర. మేం గాంధీ వారసులం.. హింసకు వ్యతిరేకం. శాంతి కోసమే ఈ యాత్ర" అని రేవంత్ రెడ్డి బదులిచ్చారు.

తెలంగాణ వచ్చాక ఎన్కౌంటర్ లు ఉండవని కేసీఆర్ చెప్పాడని... కానీ రాష్ట్రం వచ్చాక జరిగిన ఎంకౌంటర్లకు కేసీఆర్ ఏం సమాధానం చెబుతారని రేవంత్ రెడ్డి నిలదీశారు. 9నెలల్లో ప్రగతి భవన్, 12 నెలల్లో సచివాలయం కట్టారు కానీ 9 ఏళ్లలో అమరుల స్థూపం కట్టలేకపోయారని విమర్శించారు. వృథా ఖర్చులు తగ్గిస్తే రాష్ట్రం మిగులు బడ్జెట్ లోకి వెళుతుందని దుయ్యబట్టారు.

హాత్సే హాత్ పేరుతో ములుగు నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. రెండో రోజు మంగళవారం ములుగు జిల్లాలో కొనసాగింది. పలుచోట్ల ప్రజలు, రైతులతో ముచ్చటించారు. మీడియాతో, ములుగులో రాత్రి జరిగిన రోడ్‌ షోలో కూడా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అద్దాల మేడల తరహాలో కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల భూములను దొంగిలిస్తూ భూసమస్యలు పరిష్కరించని అద్దాల మేడలు ఎందుకు అని ప్రశ్నించారు.ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను పేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ నక్సలైట్లు ప్రగతి భవన్‌ను పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పలువురు బీఆర్ఎస్ నేతలు… పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి స్పందించిన రేవంత్ రెడ్డి.. ఘాటుగానే బదులిచ్చారు.

తదుపరి వ్యాసం