తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Brs On Revanth Reddy Comments : రేవంత్‌ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి

BRS On Revanth Reddy Comments : రేవంత్‌ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టాలి

08 February 2023, 16:22 IST

  • Revanth Reddy Controversial Comments:ప్రగతి భవన్ ను పేల్చివేయాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. సీఎల్పీ నేత భట్టి, సీనియర్ నేతలైనా జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ వ్యాఖ్యలను సమర్థిస్తారా?అని ప్రశ్నించారు. ప్రగతి భవన్‌ను పేల్చాలన్న రేవంత్‌ రెడ్డిపై పీడీ యాక్ట్ పెట్టి జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి చేపట్టిన హాత్‌సే హాత్‌ జోడో యాత్ర రెండో రోజు మంగళవారం ములుగు జిల్లాలో కొనసాగింది. పలుచోట్ల ప్రజలు, రైతులతో ముచ్చటించారు. మీడియాతో, ములుగులో రాత్రి జరిగిన రోడ్‌ షోలో కూడా రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అద్దాల మేడల తరహాలో కలెక్టరేట్ల నిర్మాణం చేస్తున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ధరణి పేరుతో లక్షలాది ఎకరాల భూములను దొంగిలిస్తూ భూసమస్యలు పరిష్కరించని అద్దాల మేడలు ఎందుకు అని ప్రశ్నించారు.ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్‌ను పేల్చివేయాలంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకవేళ నక్సలైట్లు ప్రగతి భవన్‌ను పేల్చివేసినా ఎవరికీ అభ్యంతరం లేదని అన్నారు. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై పలువురు బీఆర్ఎస్ నేతలు… పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు.