తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Tet Results 2024: తెలంగాణ టెట్ 2024 ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

TS TET Results 2024: తెలంగాణ టెట్ 2024 ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి

12 June 2024, 13:48 IST

google News
    • Telangana TET Results 2024 : తెలంగాణ టెట్ ఫలితాలు 2024 విడుదల అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి ఉపాధ్యాయ అర్హత పరీక్షల రిజల్ట్స్ సీడీని విడుదల చేశారు. 
తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ టెట్ ఫలితాలను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana TET Results 2024 : తెలంగాణ టెట్ ఫలితాలు 2024 అందుబాటులోకి వచ్చేశాయ్. ఉపాధ్యాయ అర్హత పరీక్ష రాసిన అభ్యర్థులు https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు.

How to Check TG TET Results 2024 : టీఎస్ టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

  • తెలంగాణ టెట్ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు ముందుగా https://tstet2024.aptonline.in/tstet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే TS TET 2024 Results ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • మీ హాల్ టికెట్ నెంబర్, Journal Number, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేసి… Get Results పై క్లిక్ చేయాలి.
  • మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
  • టీచర్ ఉద్యోగ నియామక పరీక్షలో టెట్ స్కోర్ కీలకం.
  • భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.

అర్హత శాతం వివరాలు….

తెలంగాణ టెట్ ఫలితాలను చూస్తే పేపర్-1లో 67.13 శాతం మంది అర్హత సాధించారు. ఇక పేపర్-2లో 34.18% మంది క్వాలిఫై అయ్యారు. https://schooledu.telangana.gov.in  వెబ్ సైట్ లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. ఇక 2023తో పోలిస్తే పేపర్-2లోనూ 18.88 అర్హత శాతం పెరిగినట్లు అధికారులు ప్రకటించారు.

టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగానే పరీక్షలు రాసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.  టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే ఛాన్స్ కూడా ఇస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

తెలంగాణ టెట్‌ పరీక్షలను తొలిసారిగా ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో నిర్వహించారు. మొత్తం 11 జిల్లా కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వహించారు. మే 20వ తేదీన ప్రారంభమైన తెలంగాణ టెట్ పరీక్షలు జూన్ 2వ తేదీ వరకు జరిగాయి.ఈ పరీక్షలకు 2,86,381 అప్లికేషన్లు రాగా... 2,36,487 మంది హాజరయ్యారు. 

ఇందులో పేపర్ 1 కోసం 99,958, పేపర్ 2 కోసం 1,86,423 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో పేపర్‌ 1 కు 86.03 శాతం మంది ఇక పేపర్‌-2 ఎగ్జామ్ కు 82.58 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎస్సీ నియామకాల్లో టెట్‌ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.

తెలంగాణ టెట్‌ అర్హత కాలపరిమితి జీవితకాలం ఉంటుంది. టెట్‌ పేపర్ -1లో ఉత్తీర్ణులైన వారు ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బోధించే ఎస్జీటీ పోస్టులకు అర్హులవుతారు. పేపర్‌ 2లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆరు నుంచి 8వ తరగతి వరకు బోధించే స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అర్హత పొందుతారు.

తెలంగాణలో ఉపాధ్యాయ నియామకాల కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. జూలై మాసంలో ఇందుకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి.

తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ లో భాగంగా మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 2629 స్కూల్‌ అసిస్టెంట్, ఎస్జీటీలు 6,508, భాషా పండితులు 727, పీఈటీలు 182, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 పోస్టులు ఉన్నాయి.

తదుపరి వ్యాసం