తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Govt Scholarship : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్... స్కాలర్​షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

TS Govt Scholarship : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్... స్కాలర్​షిప్ దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డేట్

31 March 2024, 8:15 IST

google News
    • TS ePASS Scholarship Updates :2023-24 విద్యాసంవత్సరానికి ఉపకార వేతనాలు, రెన్యూవల్‌, కొత్త విద్యార్థుల దరఖాస్తు గడువు ఇవాళ్టితో పూర్తి కానుంది. మిగిలిపోయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే… మార్చి 31లోపు చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. 
తెలంగాణలో ఉపకార వేతనాలు
తెలంగాణలో ఉపకార వేతనాలు

తెలంగాణలో ఉపకార వేతనాలు

TS ePASS Post-Matric Scholarship 2023- 24: రాష్ట్రంలోని విద్యార్థుల స్కాలర్​షిప్(TS ePASS Post-Matric Scholarship) అప్లికేషన్ల గడువు ఇవాళ్టి(మార్చి 31)తో పూర్తి కానుంది. ఇప్పటికే పలుమార్లు తెలంగాణ ప్రభుత్వం గడువు పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 31వ తేదీతో గడువు పూర్తి అయితే…. మళ్లీ పెంచే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. ఇంకా అప్లయ్ చేసుకొని విద్యార్థులు ఎవరైనా ఉంటే… వెంటనే దరఖాస్తు చేసుకోవాలని, రెన్యూవల్ (Scholarship)చేసుకోవాల్సిన విద్యార్థులు కూడా వెంటనే ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు.

  • కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/FreshRegistration202324.do లింక్ తో అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయవచ్చు.
  • రెన్యూవల్ చేసుకోవాల్సిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/FreshRegistration202324.do లింక్ తో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
  • మీ దరఖాస్తు స్టేటస్ ను https://telanganaepass.cgg.gov.in/applicationStatus.do లింక్ తో చెక్ చేసుకోవచ్చు.

ఈ విద్యా సంవత్సరానికి స్కాలర్ షిప్ లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ గతేడాది ఆగస్టు 19న ప్రారంభమైంది. జనవరి 31వ తేదీ వరకు గడువు ముగియటంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోలేదు. ఈ క్రమంలోనే విద్యార్థులకు మరో ఛాన్స్ ఇచ్చింది సర్కార్. దీంతో గడువును మార్చి 31వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. 

వెంటనే చెల్లించండి - బండి సంజయ్

Colleges Fee Reimbursement :  ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన టోకెన్ ల గడువు మార్చి 31తో ముగుస్తుంది. మూడేళ్లుగా బకాయి పడ్డ రూ.7800 కోట్లు ప్రభుత్వం కళాశాలకు చెల్లించాల్సి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇచ్చిన టోకెన్ లకు రేపటి లోగా డబ్బులు మంజూరు చేయాలని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్(Bandi Sanjay Kumar) డిమాండ్ చేశారు.

“బీఆర్ఎస్ పాలనలో(BRS Rule) ఎన్నడూ ఫీజురీయంబర్స్ మెంట్ సక్రమంగా చెల్లించకపోవడంతో అటు కాలేజీ యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. గత మూడేళ్లుగా ఫీజు రీయంబర్స్ మెంట్ నిధులు చెల్లించకపోవడంతో దాదాపు రూ.7800 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఫలితంగా అధ్యాపకులు, సిబ్బంది జీతభత్యాలు, కళాశాల భవనాల అద్దె, మెయింటెనెన్స్ ఛార్జీలు చెల్లించలేక గత మూడేళ్లలో వందలాది కాలేజీలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిల్లో దాదాపు రూ.750 కోట్లు డిగ్రీ, పీజీ కళాశాలలకు మార్చి నెలాఖరు నాటికి చెల్లిస్తామని పేర్కొంటూ టోకెన్లు(Tokens) జారీ చేసింది. కానీ నేటి వరకు నయా పైసా చెల్లించలేదు. మార్చి 31నాటికి టోకెన్ల గడువు ముగుస్తోంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు స్పందన లేకపోవడం బాధాకరం” అని బండి సంజయ్(Bandi Sanjay) తన లేఖలో పేర్కొన్నారు.

 

 

తదుపరి వ్యాసం