తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Gurukul Cet Results 2024 : గురుకుల 5వ తరగతి ప్రవేశాల ఫలితాలు వచ్చేశాయ్ - ఈ లింక్ తో చెక్ చేసుకోండి

TS Gurukul CET Results 2024 : గురుకుల 5వ తరగతి ప్రవేశాల ఫలితాలు వచ్చేశాయ్ - ఈ లింక్ తో చెక్ చేసుకోండి

19 April 2024, 17:46 IST

    • TS Gurukulam CET Results 2024 : తెలంగాణ గురుకుల ప్రవేశాల(5వ తరగతి) ఫలితాలు విడుదలయ్యాయి. https://tgcet.cgg.gov.in/ లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
గురుకల ఫలితాలు విడుదల
గురుకల ఫలితాలు విడుదల

గురుకల ఫలితాలు విడుదల

TS Gurukulam 5th Class Results 2024 : తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోన్న వేర్వేరు సంక్షేమ పాఠశాలల్లో ప్రవేశాల కోసం కామన్ అడ్మిషన్(TS Gurukul CET) నోటిఫికేషన్ ద్వారా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 11వ తేదీన ఈ ఎగ్జామ్ జరగా… ఇవాళ ఇందుకు సంబంధించిన ఫలితాలను ప్రకటించింది గురుకుల బోర్డు. https://tgcet.cgg.gov.in/    లింక్ పై క్లిక్ చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

TS EAPCET Results 2024 : తెలంగాణ ఎంసెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్ సైట్ లో ప్రిలిమినరీ 'కీ'లు, ఫలితాలు ఎప్పుడంటే..?

TSRTC On Jeevan Reddy : జీవన్ రెడ్డి ఆరోపణల్లో నిజం లేదు, ఇంకా రూ.2.5 కోట్లు బకాయిలు చెల్లించాలి- టీఎస్ఆర్టీసీ

TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TS Wines Shops Close : ఇవాళ్టి నుంచే వైన్స్ షాపులు బంద్ - ఎప్పటివరకంటే..?

 ఎస్సీ,ఎస్టీ, బీసీతో పాటు సాధారణ గురుకులాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పాఠశాలల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఈ ఉమ్మడి ప్రవేశపరీక్ష(TS Gurukul CET Results) నిర్వహించారు.  ఈ ఏడాదికి సంబంధించి 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ర్యాంక్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

ఇలా చెక్ చేసుకోండి

  • మొదటగా https://tgcet.cgg.gov.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • రిజల్ట్స్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • Hall Ticket Number  లేదా మీ మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేసి గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేస్తే మీ ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • - ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే ర్యాంక్ కార్డు కాపీని పొందవచ్చు.

హాల్ టికెట్లు విడుదల….

AP Model Schools: ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శ పాఠశాలల్లో ఆరోతరగతి అడ్మిషన్ల  కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు హాల్‌ టిక్కెట్లు (Hall Ticktes) విడుదల చేశారు. 2024-25 విద్యా సంవత్సరంకు గానూ రాష్ట్రంలో ఉన్న 164 ఏపీ ఆదర్శ పాఠశాల(Model Schools)ల్లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి ఏప్రిల్ 21 న అర్హత పరీక్ష నిర్వహిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు.

మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షలు అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్లు https://cse.ap.gov.in/  లేదా https://apms.apcfss.in/StudentLogin.do  వెబ్ సైట్ల నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. ఆరోతరగతిలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఐదో తరగతి స్థాయిలో ఉంటుందని, తెలుగు/ ఇంగ్లీషు మాధ్యమాల్లో రాయవచ్చని పాఠశాల విద్యాశాఖ కమీషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీల్లో 11వ తరగతిలో ప్రవేశానికి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరణ గడువు పెంచారు. సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో ఇంటర్మీడియేట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు ఏప్రిల్ 20 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు పెంచుతున్నట్లు సమగ్ర శిక్షా అధికారులు తెలిపారు. అర్హత గల అధికారులు…వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తదుపరి వ్యాసం