తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Govt Bans Mayonnaise : ఆహార ప్రియులకు షాక్, తెలంగాణలో మయోనైజ్ బ్యాన్

TG Govt Bans Mayonnaise : ఆహార ప్రియులకు షాక్, తెలంగాణలో మయోనైజ్ బ్యాన్

30 October 2024, 21:50 IST

google News
  • TG Govt Bans Mayonnaise : తెలంగాణ ప్రభుత్వం మయోనైజ్ ను నిషేధించింది. వైద్య, ఆరోగ్య శాఖ ఆదేశాలతో ఫుడ్ సెఫ్టీ కమిషనర్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార కల్తీ ఘటనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఆహార ప్రియులకు షాక్, తెలంగాణలో మయోనైజ్ బ్యాన్
ఆహార ప్రియులకు షాక్, తెలంగాణలో మయోనైజ్ బ్యాన్

ఆహార ప్రియులకు షాక్, తెలంగాణలో మయోనైజ్ బ్యాన్

తెలంగాణ ప్రభుత్వం మయోనైజ్ పై నిషేధం విధించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారులతో సమీక్ష అనంతరం వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ నిర్ణయం ప్రకటించారు. రాష్ట్రంలో తరచుగా హోటళ్లు, ఫుడ్ స్టాళ్లపై తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో మరో 3 ఫుడ్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు, 5 మొబైల్‌ ఫుడ్‌ సేఫ్టీ ల్యాబ్స్‌ ఏర్పాటు చేయాలన్నారు. కల్తీ ఆహారం ఘటనలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఆహార ప్రియులు మయోనైజ్‌ను ఎంతో ఇష్టంగా తించారు. బిర్యానీ, కబాబ్‌లు, పిజ్జాలు శాండ్‌విచ్‌లు, బర్గర్లు, ఇతర ఆహార పదార్థాల్లో మయోనైజ్ ను చట్నీలా ఉపయోగిస్తారు. ఆహార కల్తీ ఘటనలపై బల్దియా ఆదేశాలను హోటళ్లు పాటించకపోవడం, హోటళ్ల ఆహార కల్తీపై ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో మయోనైజ్ ను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది.

ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం

హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిత్యం హోటళ్లు, ఫుడ్ స్టాళ్లపై దాడులు నిర్వహిస్తున్నారు. ప్రతీ చోట ఒకటే దర్శనమిస్తుంది. అపరిశుభ్ర వాతావరణం, గడువు ముగిసిన, నిల్వ ఉంచి ఆహార పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలతో తయారీ చేసిన వంటకాలు, మురికికూపంలా వంట గదులు కనిపిస్తున్నాయి. అప్పటికప్పుడు ఆ ఆహార పదార్థాలను ధ్వంసం చేసి, కాస్తోకూస్తో ఫైన్ వేసి అధికారులు వెళ్లిపోతున్నారు. అయినా హోటళ్ల నిర్వాహకుల తీరు మారడంలేదు. మళ్లీ అదే తీరు, అదే కల్తీ. ఆహార రంగులు, కల్తీ పదార్థాలు, నాణ్యత లేని ఆహార పదార్థాలతో ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం అడుతున్నారు. ఇటీవల నగరంలో కల్తీ మోమోలు తిని ఓ మహిళ మృతి చెందగా, 50 మంది అస్వస్థతకు గురయ్యారు.

ఈ స్ట్రీట్ ఫుడ్స్ తో యమడేంజర్

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద సంఘటన.. స్ట్రీట్ ఫుడ్‌పై అనుమానాలను పెంచుతోంది. స్ట్రీట్ ఫుడ్ తిని మహిళ మరణించింది. 50 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు. షావర్మా.. హైదరాబాద్‌లో ఎంతో ఫేమస్. అదే సమయంలో ఆరోగ్యానికి హాని కూడా. మాంసాన్ని సరిగా ఉడికించకుండా.. తయారుచేసిన తర్వాత చాలా సమయం తర్వాత తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీంట్లో బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. షావర్మాలో సాధారణ బాక్టీరియాలలో సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇకోలి ఉంటాయి. ఇవి సరిగ్గా వండని లేదా నిల్వ చేసిన మాంసంలో వృద్ధి చెందుతాయి. ఈ బ్యాక్టీరియాతో వాంతులు, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి వంటివి వస్తాయి. తాజాగా తయారుచేసిన షావర్మాను మాత్రమే తినాలి.

దక్షిణాసియా అంతటా ప్రసిద్ధి చెందినది మోమోస్. కానీ.. అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేసినా.. నిల్వ చేసినా.. ప్రమాదాలను తప్పవు. స్ట్రీట్ వెండెడ్ మోమోస్‌లో ఇకోలి, లిస్టెరియా మోనోసైటోజెన్‌లు, బాసిల్లస్ సెరియస్ ఉంటాయి. ఇవి తీవ్రమైన జీర్ణశయాంతర సమస్యలను కలిగించే వ్యాధికారకాలు. ఈ బాక్టీరియా కారణంగా.. గ్యాస్ట్రోఎంటెరిటిస్ సమస్యలకు కారణం అవుతుంది. పారిశుద్ధ్య పద్ధతులను పాటించే విక్రేతల వద్ద ఉండే మోమోలను తింటే మంచిది.

పానీపూరీ.. హైదరాబాద్‌లో చాలా ఫేమస్. కానీ.. అపరిశుభ్రత కారణంగా పానీపూరీ కూడా ప్రాణాంతకంగా మారుతోంది. కలుషితమైన నీటిని ఉపయోగించడం కారణంగా సమస్యలు వస్తుంటాయి. వీటిల్లో విబ్రియో కలరా, సాల్మోనెల్లా, ఇకోలి వంటి వ్యాధికారకాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వాంతులు, తిమ్మిర్లు, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. అపరిశుభ్రంగా ఉన్న స్టాల్స్‌ను అవాయిడ్ చేస్తే మంచిది.

తదుపరి వ్యాసం