తెలుగు న్యూస్  /  ఫోటో  /  Hyderabad Street Food : హైదరాబాద్‌లో ఈ 3 రకాల స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా.. అయితే బాడీ షెడ్డుకు వెళ్లినట్టే!

Hyderabad Street Food : హైదరాబాద్‌లో ఈ 3 రకాల స్ట్రీట్ ఫుడ్ తింటున్నారా.. అయితే బాడీ షెడ్డుకు వెళ్లినట్టే!

29 October 2024, 12:16 IST

Hyderabad Street Food : హైదరాబాద్.. టెస్టీ ఫుడ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్‌కు బ్యాడ్ నేమ్ వస్తోంది. కొందరు వ్యాపారుల స్వార్థం కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా మూడు రకాల స్ట్రీట్ ఫుడ్ ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకొస్తోంది. షావర్మ, మోమోస్, పానీపూరి ప్రాణాంతకంగా మారాయి.

  • Hyderabad Street Food : హైదరాబాద్.. టెస్టీ ఫుడ్‌కు కేరాఫ్ అడ్రస్. ఇప్పుడు స్ట్రీట్ ఫుడ్‌కు బ్యాడ్ నేమ్ వస్తోంది. కొందరు వ్యాపారుల స్వార్థం కారణంగా ప్రాణాలు పోతున్నాయి. ముఖ్యంగా మూడు రకాల స్ట్రీట్ ఫుడ్ ప్రాణాలకు ప్రమాదాన్ని తీసుకొస్తోంది. షావర్మ, మోమోస్, పానీపూరి ప్రాణాంతకంగా మారాయి.
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద సంఘటన.. స్ట్రీట్ ఫుడ్‌పై అనుమానాలను పెంచుతోంది. స్ట్రీట్ ఫుడ్ తిని మహిళ మరణించింది. 50 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.
(1 / 5)
హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన విషాద సంఘటన.. స్ట్రీట్ ఫుడ్‌పై అనుమానాలను పెంచుతోంది. స్ట్రీట్ ఫుడ్ తిని మహిళ మరణించింది. 50 మంది వరకు ఆసుపత్రి పాలయ్యారు. స్ట్రీట్ ఫుడ్స్‌లో ఉండే బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు అనారోగ్యానికి కారణం అవుతున్నాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు చెబుతున్నారు.(@sudhakarudumula)
షావర్మా.. హైదరాబాద్‌లో ఎంతో ఫేమస్. అదే సమయంలో ఆరోగ్యానికి హాని కూడా. మాంసాన్ని సరిగా ఉడికించకుండా.. తయారుచేసిన తర్వాత చాలా సమయం తర్వాత తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీంట్లో బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. షావర్మాలో సాధారణ బాక్టీరియాలలో సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇకోలి ఉంటాయి. ఇవి సరిగ్గా వండని లేదా నిల్వ చేసిన మాంసంలో వృద్ధి చెందుతాయి. ఈ బ్యాక్టీరియాతో వాంతులు, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి వంటివి వస్తాయి. తాజాగా తయారుచేసిన షావర్మాను మాత్రమే తినాలి. బాగా ఉడికించి, శుభ్రంగా ఉన్న షావర్మాను తింటే సేఫ్. 
(2 / 5)
షావర్మా.. హైదరాబాద్‌లో ఎంతో ఫేమస్. అదే సమయంలో ఆరోగ్యానికి హాని కూడా. మాంసాన్ని సరిగా ఉడికించకుండా.. తయారుచేసిన తర్వాత చాలా సమయం తర్వాత తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దీంట్లో బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజనింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. షావర్మాలో సాధారణ బాక్టీరియాలలో సాల్మొనెల్లా, స్టెఫిలోకాకస్ ఆరియస్, ఇకోలి ఉంటాయి. ఇవి సరిగ్గా వండని లేదా నిల్వ చేసిన మాంసంలో వృద్ధి చెందుతాయి. ఈ బ్యాక్టీరియాతో వాంతులు, విరేచనాలు, పొత్తికడుపు నొప్పి వంటివి వస్తాయి. తాజాగా తయారుచేసిన షావర్మాను మాత్రమే తినాలి. బాగా ఉడికించి, శుభ్రంగా ఉన్న షావర్మాను తింటే సేఫ్. (@sudhakarudumula)
దక్షిణాసియా అంతటా ప్రసిద్ధి చెందినది మోమోస్. కానీ.. అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేసినా.. నిల్వ చేసినా.. ప్రమాదాలను తప్పవు. స్ట్రీట్ వెండెడ్ మోమోస్‌లో ఇకోలి, లిస్టెరియా మోనోసైటోజెన్‌లు, బాసిల్లస్ సెరియస్ ఉంటాయి. ఇవి తీవ్రమైన జీర్ణశయాంతర సమస్యలను కలిగించే వ్యాధికారకాలు. ఈ బాక్టీరియా కారణంగా.. గ్యాస్ట్రోఎంటెరిటిస్ సమస్యలకు కారణం అవుతుంది. పారిశుద్ధ్య పద్ధతులను పాటించే విక్రేతల వద్ద ఉండే మోమోలను తింటే మంచిది. 
(3 / 5)
దక్షిణాసియా అంతటా ప్రసిద్ధి చెందినది మోమోస్. కానీ.. అపరిశుభ్రమైన పరిస్థితులలో తయారు చేసినా.. నిల్వ చేసినా.. ప్రమాదాలను తప్పవు. స్ట్రీట్ వెండెడ్ మోమోస్‌లో ఇకోలి, లిస్టెరియా మోనోసైటోజెన్‌లు, బాసిల్లస్ సెరియస్ ఉంటాయి. ఇవి తీవ్రమైన జీర్ణశయాంతర సమస్యలను కలిగించే వ్యాధికారకాలు. ఈ బాక్టీరియా కారణంగా.. గ్యాస్ట్రోఎంటెరిటిస్ సమస్యలకు కారణం అవుతుంది. పారిశుద్ధ్య పద్ధతులను పాటించే విక్రేతల వద్ద ఉండే మోమోలను తింటే మంచిది. (@sudhakarudumula)
పానీపూరీ.. హైదరాబాద్‌లో చాలా ఫేమస్. కానీ.. అపరిశుభ్రత కారణంగా పానీపూరీ కూడా ప్రాణాంతకంగా మారుతోంది. కలుషితమైన నీటిని ఉపయోగించడం కారణంగా సమస్యలు వస్తుంటాయి. వీటిల్లో విబ్రియో కలరా, సాల్మోనెల్లా, ఇకోలి వంటి వ్యాధికారకాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వాంతులు, తిమ్మిర్లు, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. అపరిశుభ్రంగా ఉన్న స్టాల్స్‌ను అవాయిడ్ చేస్తే మంచిది.
(4 / 5)
పానీపూరీ.. హైదరాబాద్‌లో చాలా ఫేమస్. కానీ.. అపరిశుభ్రత కారణంగా పానీపూరీ కూడా ప్రాణాంతకంగా మారుతోంది. కలుషితమైన నీటిని ఉపయోగించడం కారణంగా సమస్యలు వస్తుంటాయి. వీటిల్లో విబ్రియో కలరా, సాల్మోనెల్లా, ఇకోలి వంటి వ్యాధికారకాలు ఉంటాయి. ఈ బ్యాక్టీరియా వాంతులు, తిమ్మిర్లు, అతిసారం వంటి సమస్యలకు కారణం అవుతుంది. అపరిశుభ్రంగా ఉన్న స్టాల్స్‌ను అవాయిడ్ చేస్తే మంచిది.(@sudhakarudumula)
ఈ 3 రకాల స్ట్రీట్‌ ఫుడ్‌లో సూక్ష్మజీవులు అంటువ్యాధులకు కూడా కారణమవుతాయి. ఇవి జీర్ణశయాంతర వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వేగంగా నిర్జలీకరణం, పోషకాల నష్టానికి దారితీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే.. తీవ్రమైన అంటువ్యాధులు మూత్రపిండాలు, కాలేయ, సెప్టిసిమియా వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. మరణానికి కూడా దారితీస్తాయి. 
(5 / 5)
ఈ 3 రకాల స్ట్రీట్‌ ఫుడ్‌లో సూక్ష్మజీవులు అంటువ్యాధులకు కూడా కారణమవుతాయి. ఇవి జీర్ణశయాంతర వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. వేగంగా నిర్జలీకరణం, పోషకాల నష్టానికి దారితీస్తుంది. చికిత్స చేయకుండా వదిలేస్తే.. తీవ్రమైన అంటువ్యాధులు మూత్రపిండాలు, కాలేయ, సెప్టిసిమియా వంటి ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. మరణానికి కూడా దారితీస్తాయి. 

    ఆర్టికల్ షేర్ చేయండి