తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bjp Kishan Reddy : తెలంగాణలో ఒంటరిగానే పోటీ... పార్లమెంట్ ఎన్నికలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

BJP Kishan Reddy : తెలంగాణలో ఒంటరిగానే పోటీ... పార్లమెంట్ ఎన్నికలపై కిషన్ రెడ్డి కీలక ప్రకటన

HT Telugu Desk HT Telugu

27 March 2024, 11:37 IST

google News
    • TS BJP Chief Kishanreddy News: పార్లమెంట్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో… పొత్తులపై కీలక ప్రకటన చేశారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తెలంగాణలో బీజేపీ పార్టీ.. ఒంటరిగానే పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Telangana Bjp Chief Kishanreddy: మరికొన్ని నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై కేంద్ర మంత్రి,తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవని,తెలంగాణలో బీజేపీ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.

ఈ నెలాఖరులో నడ్డా పర్యటన : కిషన్ రెడ్డి

సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఫలితాలు ఉండబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నెలాఖరులో బీజేపీ జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా తెలంగాణ లో పర్యటిస్తారని కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్,బిఆర్ఎస్ కంటే బీజేపీ ఎక్కువ సీట్లు సాదిస్తుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.ఇక గెలిచిన ఎమ్మెల్యేలు అంతా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తారని కిషన్ రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పార్టీ నేతలకు,కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.

ఇటీవలే జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిజేపి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెల్సిందే. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 8 స్థానాలను బిజెపి కేటాయించగా పోటీ చేసిన 8 చోట్లలో జనసేన డెపోజిట్ లు కోల్పోయింది.తెలంగాణ లో జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ఇమేజ్ కలిసి వస్తుందని భావించి జనసేన తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి ఎదురు దెబ్బ తగిలింది.జనసేనతో పొత్తు పెట్టుకున్నందుకు బీజేపీకి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.జనసేన కంటే బీజేపీ పోటీ చేసిన నియోజకవర్గాల్లోనే పార్టీ అభ్యర్థులు ఎక్కువ ఓట్లు సాధించారు.

ఇక అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన నష్టంపై బీజేపీ కాస్త ముందుగానే అప్రమత్తమై పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు కనబడుతుంది. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 8 చోట్ల విజయం సాధించగా....ఆ పార్టీ కీలక నేతలు బండి సంజయ్,ఈటెల రాజేందర్,ధర్మపురి అరవింద్,రఘునందన్ రావు ఓడిపోవడం గమనార్హం.

రిపోర్టింగ్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం