తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  బ్లాక్‌బస్టర్ బీర్.. మార్కెట్లోకి కొత్త బ్రాండ్!

బ్లాక్‌బస్టర్ బీర్.. మార్కెట్లోకి కొత్త బ్రాండ్!

HT Telugu Desk HT Telugu

10 March 2022, 14:53 IST

google News
    • బీర్ ప్రియులకు గుడ్ న్యూస్, తెలుగు రాష్ట్రాలలో మరో కొత్త బ్రాండ్ బీర్ అందుబాటులోకి వచ్చింది. అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 'బ్లాక్ బస్టర్' అనే బీర్ వేరియంట్ రిలీజ్ చేసింది.
Beer- representative image
Beer- representative image (AFP)

Beer- representative image

Hyderabad | తెలంగాణకు చెందిన బీర్ తయారీదారు అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ తన ఫ్లాగ్‌షిప్ బ్రాండ్ బ్లాక్‌బస్టర్ (బిబి) బీర్‌ను విడుదల చేసింది. ఇందులో తేలికైనటువంటి లేజర్, అలాగే కొద్దిగా ఘాటైన స్ట్రాంగ్ రకాలను అందిస్తోంది. ప్రస్తుతం ఈ బీర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, పాండిచ్చేరి, గోవా రాష్ట్రాలలో అందుబాటులో ఉంటుందని కంపెనీ వారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2022 చివరి నాటికి దేశంలోని కనీసం 12 రాష్ట్రాలకు మా పరిధిని విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు.

అమెరికన్ బ్రూ క్రాఫ్ట్స్ తెలంగాణలోని సంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ అలాగే మరొకటి అమెరికాలో కేంద్రాలుగా బీర్ తయారు చేసే బ్రూవరీలను నిర్వహిస్తోంది. అత్యాధునిక జర్మన్ యంత్రాలతో ఎంతో జాగ్రత్తగా, హైజినీక్ పద్ధతుల్లో బీర్‌ను తయారు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి యూనిట్ బీర్ రెసిపీపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ రుచిలో, క్వాలిటీలో ఏమాత్రం రాజీపడటం లేదని పేర్కొన్నారు. బీర్ ప్రియులను తమ బ్లాక్ బస్టర్ బీర్ రీఫ్రెష్ చేయడంతో పాటు గొప్ప అనుభూతి, థ్రిల్‌ను- ఇస్తుందని కంపెనీ చెబుతోంది.

ఇకపోతే ఈ అమెరికన్ బ్రూక్రాఫ్ట్స్ కంపెనీ తమ బ్రాండ్ నుంచి బీర్ తయారీకోస సంగారెడ్డి జిల్లాలో రూ. 300 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇందుకోసం 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న లీలాసన్స్ బ్రూవరీని కొనుగోలు చేసింది. ఇక్కడి నుంచి ఏడాదికి 25 లక్షల బీర్ కేసులు ఉత్పత్తి జరుగుతుంది. ఏపీలో ఉన్న బ్రూవరీ నుంచి 30 లక్షల కేసులు ఉత్పత్తి అవుతుంది. ఈ కంపెనీ నుంచి బ్లాక్ బస్టర్ మాత్రమే కాకుండా ఖజురహో అనే మరో వేరియంట్ కూడా ఉత్పత్తి అవుతుంది.

తదుపరి వ్యాసం