SCR Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్ రద్దీ-48 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
18 September 2024, 15:45 IST
- SCR Special Trains : దసరా, దీపావళి పండుగల సీజన్ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు ప్రకటించింది. నాందేడ్, పన్వెల్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు, పెన్వెల్-నాందేడ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వెల్లడించింది. కరీంనగర్-పూణే మధ్య నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
దసరా, దీపావళి పండుగల సీజన్ రద్దీ-48 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
SCR Special Trains : వచ్చేది దసరా, దీపావళి పండుగల సీజన్. సెలవులకు స్వగ్రామాలకు, విహారయాత్రలకు ప్రయాణాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు రద్దీ దృష్ట్యా 48 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ప్రకటించారు. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 27 వరకు సోమ, బుధ వారాల్లో నాందేడ్ నుంచి పన్వెల్‌కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అలాగే అక్టోబర్ 22 నుంచి నవంబర్ 28 వరకు మంగళ, గురు వారాల్లో పన్వెల్ నుంచి నాందేడ్ కు 12 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
వీటితో పాటు అక్టోబర్ 11వ తేదీ నుంచి నవంబర్ 29 వరకు ప్రతి శుక్రవారం కొచువెలి నుంచి నిజాముద్దీన్ వరకు 8 ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. అక్టోబర్ 14 నుంచి డిసెంబర్ 2 వరకు ప్రతి సోమవారం నిజాముద్దీన్-కొచువెలి మధ్య 8 ప్రత్యేక రైళు, అక్టోబర్ 21 నుంచి నవంబర్ 11 వరకు ప్రతి సోమవారం పూణే నుంచి కరీంనగర్ వరకు 4 ప్రత్యేక రైళ్లు, అక్టోబర్ 23 నుంచి నవంబర్ 13 వరకు ప్రతి బుధవారం కరీంనగర్ నుంచి పూణే వరకు నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ మధ్య రెండు ఏసీ స్పెషల్ రైళ్లు
దసరా, దీపావళి, ఛత్ పండుగల సీజన్‌లో ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి.. ఇండియన్ రైల్వే సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. సికింద్రాబాద్ - శ్రీకాకుళం రోడ్ ఏసీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (07487) రైలు.. అక్టోబర్ 2 నుంచి నవంబర్ 6 వరకు ప్రతి బుధవారం నాడు రాత్రి 7:40 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9:10 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది.
అక్కడ నుంచి ఉదయం 9:12 గంటలకు బయలుదేరి ఉదయం 9:53 గంటలకు పెందుర్తి చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 9:55 గంటలకు బయలుదేరి ఉదయం 10:05 గంటలకు కొత్తవలస చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 10:07 గంటలకు బయలుదేరి ఉదయం 10:30 గంటలకు విజయనగరం చేరుకుంటుంది. అక్కడ నుంచి ఉదయం 10:40 గంటలకు బయలుదేరి ఉదయం 11:00 గంటలకు చీపురుపల్లి చేరుకుంటుంది. 11:02 గంటలకు బయలుదేరి, శ్రీకాకుళం రోడ్డుకు మధ్యాహ్నం 12:00 గంటలకు చేరుకుంటుంది. మొత్తం ఆరు ట్రిప్పులు ఉంటుంది.
శ్రీకాకుళం రోడ్ - సికింద్రాబాద్ ఏసీ స్పెషల్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ (07488) రైలు అక్టోబర్ 3 నుంచి నవంబర్ 7 వరకు.. ప్రతి గురువారం శ్రీకాకుళం రోడ్‌లో సాయంత్రం 5:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు చీపురుపల్లికి సాయంత్రం 5:33 గంటలకు చేరుకుని, అక్కడ నుండి 5:35 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరం సాయంత్రం 6:00 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుండి సాయంత్రం 6:10 గంటలకు బయలుదేరి, కొత్తవలస సాయంత్రం 6:35 గంటలకు చేరుకుంటుంది.
అక్కడ నుంచి సాయంత్రం 6:37 గంటలకు బయలుదేరి పెందుర్తికి సాయంత్రం 6:45 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుంచి సాయంత్రం 6:47 గంటలకు బయలు దేరి రాత్రి 7:33 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 7:35 గంటలకు బయలుదేరి శుక్రవారం ఉదయం 9:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మొత్తం ఆరు ట్రిప్పులు ఉంటాయి.