Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే-scr cancelled another 28 trains running in ap telangana some trains diverted ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Bandaru Satyaprasad HT Telugu
Sep 03, 2024 02:12 PM IST

Trains Cancelled : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలకు పలు చోట్ల రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. రైల్వే అధికారులు ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నారు. దీంతో ఏపీ, తెలంగాణ మీదుగా నడిచే మరో 28 రైళ్లను తాజాగా రద్దు చేశారు. పలు రైళ్లను దారి మళ్లించారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరో 28 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

Trains Cancelled : భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. తాజాగా మరో 28 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పలు రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా సోమవారం వరకు 496 రైళ్లు రద్దు కాగా, 152 రైళ్లను దారి మళ్లించారు. ఇవాళ మరో 28 రైళ్లు రద్దు చేశారు.

రద్దైన రైళ్లు

  • 22870 - చెన్నై సెంట్రల్ టు విశాఖపట్నం - 03.09.24
  • 20811 -విశాఖపట్నం టు నాందేడ్ - 03.09.24
  • 20812 - నాందేడ్ టు విశాఖపట్నం - 04.09.24
  • 17208 - మచిలీపట్నం టు షిర్డీ సాయినగర్ - 03.09.24
  • 17207 - షిర్డీ సాయినగర్ టు మచిలీపట్నం - 04.09.24
  • 18046 - హైదరాబాద్ టు షాలిమార్ - 04.09.24
  • 17405 - తిరుపతి టు ఆదిలాబాద్ - 03.09.24
  • 12787 - నరసాపూర్ టు నాగర్ సోల్ - 03.09.24
  • 12788 - నాగర్ సోల్ టు నరసాపూర్ - 04.09.24
  • 12706 - సికింద్రాబాద్ టు గుంటూరు - 03.09.24
  • 12705 - గుంటూరు టు సికింద్రాబా - 03.09.24
  • 12295 - బెంగళూరు టు దానాపూర్ - 03.09.24
  • 12749 - మచిలీపట్నం టు బీదర్ - 03.09.24
  • 12750 - బీదర్ టు మచిలీపట్నం - 03.09.24

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మీదుగా ప్రయాణించే మరో 10 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కొన్ని రైళ్లను ఒక రోజు, మరికొన్నింటిని మూడు రోజుల పాటు రద్దు చేసినట్లు తెలిపారు. కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలో రద్దైన రైళ్ల వివరాలు ప్రత్యేక బోర్డులపై రైల్వే స్టేషన్లలో ప్రదర్శిస్తున్నారు. రాజమండ్రి, సామర్లకోట, తుని, పిఠాపురం మీదుగా వెళ్లే విశాఖపట్నం-గుంటూరు రైలును(17240) ఈ నెల 6వ తేదీ వరకు నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. విశాఖపట్నం-బెజవాడ(12717), బెజవాడ-విశాఖపట్నం(12718 ) రైలను ఇవాళ్టికి రద్దు చేశారు.

రాయగడ ఎక్స్ ప్రెస్ రద్దు

విశాఖపట్నం-హైదరాబాద్(12727) రైలు ఇవాళ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలియజేశారు. రేపటి వరకు పలు రైళ్లను తాత్కాలిక రద్దు చేసినట్లు తెలియజేశారు. రాయగడ-గుంటూరు(17244,17243) ఎక్స్ ప్రెస్, టాటా ఎక్స్ ప్రెస్(18190) ను ఈ నెల 6 వ తేదీ వరకు నిలిపివేశారు. తో పాటు 17243 రైలును రద్దు చేసినట్లుగా తెలిపారు.

సంబంధిత కథనం