SCR Special Trains : నర్సాపూర్, బెంగళూరు, కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లు
04 March 2023, 5:45 IST
- South Central Railway Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది. మరోవైపు పలు రూట్లలో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
ప్రత్యేక రైళ్లు
South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... మరికొన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. బెంగళూరు- నర్సాపూర్, నర్సాపూర్ - బెంగళూరు, బెంగళూరు - కాచిగూడ, కాచిగూడ - బెంగళూరు మధ్య ఈ స్పెషల్ ట్రైన్స్ ను నడపనుంది. వీటి వివరాలను చూస్తే....
బెంగళూరు - నర్సాపూర్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మార్చి 5వ తేదీన ఉదయం 11.20 నిమిషాలకు స్పెషల్ ట్రైన్ బెంగళూరు నుంచి బయల్దేరుతుంది. ఇది మరునాడు ఉదయం 06.30 గంటలకు నర్సాపూర్ చేరుతుంది. ఇక నర్సాపూర్ నుంచి మార్చి 6వ తేదీన ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. ఇది మధ్యాహ్నం 03.40 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 గంటలకు బెంగళూరు చేరుతుంది. ఇక బెంగళూరు - నర్సాపూర మధ్య మార్చి 4వ తేదీన కూడా ప్రత్యేక రైలు అందుబాటులో ఉంది. ఇది నర్సాపూర్ నుంచి మధ్యాహ్నం 03.40 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 10.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
బెంగళూరు - కాచిగూడ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మార్చి 5వ తేదీన మధ్యాహ్నం 03.30 గంటలకు బెంగళూరు నుంచి బయల్దేరి... మరునాడు ఉదయం 05.20 గంటలకు కాచిగూడకు చేరుతుంది. ఇక కాచిగూడ నుంచి బెంగళూరుకు మార్చి, 4, 6వ తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ ట్రైన్లు రాత్రి 10.55 గంటలకు కాచిగూడ నుంచి బయల్దేరి... మరునాడు ఉదయం 11.45 నిమిషాలకు బెంగళూరుకు చేరుతుంది.
ఇక సికింద్రాబాద్ - దనపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 5వ తేదీన సికింద్రాబాద్ స్టేషన్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రత్యేక రైలు బయల్దేరి... మరునాడు రాత్రి 10.30 గంటలకు దనపూర్ చేరుతుంది. ఇక దనపూర్ నుంచి సికింద్రాబాద్ కు మార్చి 9వ తేదీన సర్వీస్ అందుబాటులో ఉంది. ఇది ధనపూర్ నుంచి రాత్రి 08.50 గంటలకు బయల్దేరి...మరునాడు ఉదయం 04.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. ఈట్రైన్ లో ఫస్ట్ ఏసీ, ఏసీ 2టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్, అండ్ జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు అందుబాటులో ఉంటాయని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
పలు రైళ్లు రద్దు…
పలు రూట్లలో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. విజయవాడ - గూడురు, కాజీపేట - తిరుపతి, సూళూరుపేట, నెల్లూరు, విజయవాడతో పాటు పలు రూట్లలో నడిచే రైళ్లు రద్దు అయ్యాయి. ఈ మేరకు తేదీలను వెల్లడించింది.
హోలీ పండగ దృష్ట్యా... హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ నుంచి బికనేర్, సికింద్రాబాద్ నుంచి రక్సౌల్ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మార్చి 4వ తేదీన సికింద్రాబాద్-రక్సౌల్ ( ట్రైన్ నెంబర్ 07051) ఎక్స్‌ప్రెస్ రైలు, రక్సౌల్-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్. 07052) రైలును మార్చి 9వ తేదీన నడపనుంది. ఇక మార్చి 4వ తేదీన కాచిగూడ-బికనేర్ (ట్రైన్ నెంబర్. 07053) ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. మార్చి 7వ తేదీన బికనేర్-కాచిగూడ (ట్రైన్ నెంబర్ - 07054) రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ హోలీ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని ప్రకటించారు.