SCR Special Trains : అలర్ట్... సికింద్రాబాద్ నుంచి పలు ప్రాంతాలకు స్పెషల్ ట్రైన్లు.. డేట్స్, టైమింగ్స్ ఇవే
11 March 2023, 5:50 IST
- South Central Railway Special Trains: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... మరికొన్ని ప్రాంతాలకు కూడా సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్ - దానాపూర్, హుబ్లీ - సికింద్రాబాద్, సికింద్రాబాద్ - హుబ్లీ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఈ మేరకు షెడ్యూల్ చూస్తే......
సికింద్రాబాద్ - ధన్ పూర్(ట్రైన్ నెంబర్ 07219) మధ్య ప్రత్యేక రైలును ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. మార్చి 12వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఈ ట్రైన్ కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, కాగజ్ నగర్, బాలర్షా, నాగ్ పూర్, ఇటార్షీ, కాట్నీ, సాత్నా, మణిక్ పూర్, డీడీ ఉపాధ్యాయ, అరా స్టేషన్లలో ఆగుతుందని ప్రకటించారు.
హుబ్లీ - సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 07319), సికింద్రాబాద్ - హుబ్లీ(ట్రైన్ నెంబర్ 07320) మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. మార్చి 12, 13వ తేదీల్లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ రైళ్లు.... గడాగ్, కోపాల్, హోసిపేట్, బల్లారి, అదోనీ, మంత్రాలయం, రాయచూర్, యాద్గిర్, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి స్టేషన్లలో ఆగుతుందని తెలిపారు.
ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్ క్లాస్ మరియు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని అధికారులు ప్రకటించారు. ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
పలు రైలు రద్దు…
Cancellation and Reschedule of Trains: ఇదిలా ఉంటే పలు మార్గాల్లో నడిచే రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. ఇక ఇప్పటికే ప్రకటించిన...పలు రైళ్ల సమయాల్లో కూడా మార్పులు చేశారు. మరికొన్నింటిని రీషెడ్యూల్ చేశారు.
ట్రైన్ నంబర్ 01414/01413 పండార్‌పూర్-నిజామాబాద్-పంఢార్‌పూర్ రైలును 10,11 తేదీల్లో రద్దుచేస్తున్నట్లు ప్రకటించారు. ట్రాక్షన్ మరమ్మతుల రీత్యా పలు రైళ్లు ఆలశ్యంగా నడుస్తాయని అధికారులు ప్రకటించారు. ట్రైన్ నంబర్ 17617 ముంబై సిఎస్‌టి-నాందేడ్ రెండు గంటలకు పైగా నియంత్రిస్తారు. ట్రైన్ నంబర్ 17630 నాందేడ్-పూణే రైలును కూడా రెండు గంటల పైగా నియంత్రిస్తారు.
ట్రైన్ నంబర్ 17661 కాచిగూడ- రోటేగావ్ రైలును మూడుగంటలు, ట్రైన్ నంబర్ 12788 నాగర్‌సోల్-నర్సాపూర్ రైలును 14వ తేదీన గంటన్నర, ట్రైన్ నంబర్ 17232 నాగర్‌సోల్ - నర్సాపూర్ రైలును 11వ తేదీన గంటన్నర నియంత్రిస్తారు. ధర్మవరం-మన్మాడ్ రైలును 12, 15 తేదీలలో గంట పాటు రీ షెడ్యూల్ చేస్తారు.
గంగినేని-ఎర్రుపాలెం స్టేషన్ల వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల దృష్ట్యా పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటనలో తెలిపారు.
ట్రైన్ నంబర్ 07091/07092 కాజీపేట-తిరుపతి-కాజీపేట రైలునుఈ నెల 14వ తేదీ రద్దు చేశారు. 07185/07186 మచిలీపట్నం-సికింద్రాబాద్ రైలును ఈ నెల 12వ తేదీ రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07755/07756 విజయవాడ-డోర్నకల్-విజయవాడ ప్యాసింజర్ రైలును ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు రద్దు చేశారు. ట్రైన్ నంబర్ 07465/07464 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్ రైలును (ఈ నెల 10వ తేదీ నుంచి 18వరకు, ట్రైన్ నంబర్ 07979/07278 విజయవాడ-భద్రాచలం రోడ్ రైలును ఈ నెల 10వ తేదీ నుంచి 18వరకు రద్దు చేశారు.
ట్రైన్ నంబర్ 17201/17202 గుంటూరు-సికింద్రాబాద్ రైలును కాజీపేట-గుంటూరు మధ్య రద్దు చేశారు. ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండదు. ట్రైన్ నంబర్ 12705/1270 గుంటూరు-సికింద్రాబాద్ రైలును ఖమ్మం-గుంటూరు మధ్య ఈ నెల 10 నుంచి 18వ తేదీ వరకు చేశారు. .