తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mla Harish Rao Letter : యాసంగి పంటలు ఎండిపోతున్నాయ్, రంగనాయక సాగర్ కు నీళ్లు ఇవ్వాలని హరీశ్ రావు లేఖ

Mla Harish Rao Letter : యాసంగి పంటలు ఎండిపోతున్నాయ్, రంగనాయక సాగర్ కు నీళ్లు ఇవ్వాలని హరీశ్ రావు లేఖ

HT Telugu Desk HT Telugu

10 March 2024, 19:42 IST

    • Mla Harish Rao Letter : కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. రంగనాయక సాగర్ లోకి ఒక టీఎంసీ నీళ్లు ఎత్తిపోసి సిద్దిపేట రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు.
హరీశ్ రావు
హరీశ్ రావు

హరీశ్ రావు

Mla Harish Rao Letter : సిద్దిపేట రైతులను(Siddipet Farmers) తక్షణమే ఆదుకునే చర్యలను ప్రభుత్వం చేపట్టాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా రైతుంగానికి సాగు నీళ్లు అందించాలని, రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలని కోరారు. కాలువలు రాకపోవటం వలన, నీళ్లు లేక కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని, దీంతో రైతుల పైన ఆర్థిక భారం పడుతుందన్నారు. ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. రంగనాయక సాగర్(Ranganayaka Sagar) లోకి వెంటనే ఒక టీఎంసీ(TMC) నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో ఉన్న రైతుల సమస్యను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామన్నారు. రైతుల పక్షాన అండగా నిలుస్తామని ప్రకటించారు. సిద్దిపేట రైతుల సమస్యలను లేవనెత్తుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి(Uttam Kumar Reddy) లేఖ రాశారు. సిద్దిపేట జిల్లా రైతంగ ప్రయోజనాల దృష్ట్యా కొన్ని అంశాలను మంత్రి దృష్టికి తీసుకు వస్తున్నానన్నారు.

ట్రెండింగ్ వార్తలు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, రేపు మధ్యాహ్నం సమావేశం

యాసంగి పంటలు ఎండిపోతున్నాయ్

ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేఖలో హరీశ్ రావు కోరారు. సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో సాగుచేస్తున్న యాసంగి పంటలు(Rabi) చేతికి రావాలంటే వెంటనే సాగు నీరందించాలని విజ్ఞప్తి చేశారు. గడిచిన నాలుగేళ్లలో ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సరిపడా సాగునీటిని అందుబాటులో ఉంచామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రైతులను ఆదుకోవడంలో అలసత్వం వహిస్తున్నట్లుగా అర్థమవుతుందన్నారు. ఓ పక్క సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయి. కళ్లముందే ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. కొత్త బోర్లు వేయిస్తూ అప్పుల పాలవుతున్నారన్నారు. వ్యవసాయ బావులకు సంబంధించి పూడికతీత పనుల్లో రైతులు నిమగ్నమయ్యారన్నారు. ఈ దుస్థితిని అధిగమించాలంటే వెంటనే రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి 1 టీఎంసీ నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు.

రంగనాయకసాగర్ నిండు కుండల ఉండేది

గత నాలుగేళ్లపాటు ఈ సమయంలో రంగనాయక సాగర్ నిండుకుండలా నీటితో కళకళలాడింది. కానీ ప్రస్తుతం నీళ్లు లేక రిజర్వాయర్ బోసిపోయి కనిపిస్తున్నదని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్(Mallanna Sagar reservoir) నుంచి కూడా తక్షణమే నీటిని విడుదల చేయాలన్నారు. అన్నపూర్ణ(అనంతగిరి) రిజర్వాయర్ లో కూడా 1 టీఎంసీ నీటిని నిల్వ ఉంచాలని లేఖలో కోరారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి వాస్తవాలను గ్రహించాల్సిందిగా కోరుతున్నానన్నారు. రాజకీయాలు కాకుండా రైతుల ప్రయోజనాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు తగిన పరిష్కారం చూపించకుంటే త్వరలోనే రైతుల పక్షాన పోరాటాలకు సైతం సిద్ధమవుతామని స్పష్టం చేశారు. రైతులకు అండగా ఉంటానన్నారు.

తదుపరి వ్యాసం