చుక్క నీరు లేక అల్లాడిపోతున్న బెంగళూరు ప్రజలు.. సంక్షోభానికి అసలు కారణం ఏంటి?-bengaluru water crisis all you need to know about struggle before summer ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  చుక్క నీరు లేక అల్లాడిపోతున్న బెంగళూరు ప్రజలు.. సంక్షోభానికి అసలు కారణం ఏంటి?

చుక్క నీరు లేక అల్లాడిపోతున్న బెంగళూరు ప్రజలు.. సంక్షోభానికి అసలు కారణం ఏంటి?

Mar 10, 2024, 01:40 PM IST Sharath Chitturi
Mar 10, 2024, 01:40 PM , IST

  • బెంగళూరులో నీటి సంక్షోభం రోజురోజుకు ముదురుతోంది. చాలా చోట్ల ప్రజలు నీరు లేక అల్లాడిపోతున్నారు.

బెంగళూరులో నీటి సంక్షోభం ఏర్పడింది. ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజా పరిణామాలు.. తాగునీటి సరఫరాపైనే కాకుండా సాగునీటిపైనా ప్రభావం చూపాయి. 

(1 / 10)

బెంగళూరులో నీటి సంక్షోభం ఏర్పడింది. ప్రజలు అల్లాడిపోతున్నారు. తాజా పరిణామాలు.. తాగునీటి సరఫరాపైనే కాకుండా సాగునీటిపైనా ప్రభావం చూపాయి. (PTI)

బెంగళూరులోని 14,700 బోర్లకు గాను 6,997 బోరుబావులు ఎండిపోయాయి. వేసవి కాలంలో ఈ నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతుందని తెలుస్తోంది.

(2 / 10)

బెంగళూరులోని 14,700 బోర్లకు గాను 6,997 బోరుబావులు ఎండిపోయాయి. వేసవి కాలంలో ఈ నీటి సంక్షోభం మరింత తీవ్రమవుతుందని తెలుస్తోంది.(AFP)

తగినంత వర్షపాతం లేకపోవడం, భూగర్భ జలాల స్థాయి పడిపోవడం, వాటి అధిక వినియోగం వంటి కారణాలతో రోజుకు 250 మిలియన్ లీటర్ల (ఎంఎల్​డ) లోటు ఏర్పడిందని అధికారులు నివేదించారు. 

(3 / 10)

తగినంత వర్షపాతం లేకపోవడం, భూగర్భ జలాల స్థాయి పడిపోవడం, వాటి అధిక వినియోగం వంటి కారణాలతో రోజుకు 250 మిలియన్ లీటర్ల (ఎంఎల్​డ) లోటు ఏర్పడిందని అధికారులు నివేదించారు. (AFP)

నగరానికి తాగునీటిని సరఫరా చేసే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) ప్రకారం.. బెంగళూరుకు నీటి ఇన్పుట్ 50 శాతం పడిపోయింది. 

(4 / 10)

నగరానికి తాగునీటిని సరఫరా చేసే బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) ప్రకారం.. బెంగళూరుకు నీటి ఇన్పుట్ 50 శాతం పడిపోయింది. (AFP)

బెంగళూరు ప్రాంతంలో తగినంత వర్షపాతం లేకపోవడంతో కావేరీ నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. ఇది అత్యంత ఆందోళనకర విషయం!

(5 / 10)

బెంగళూరు ప్రాంతంలో తగినంత వర్షపాతం లేకపోవడంతో కావేరీ నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గింది. ఇది అత్యంత ఆందోళనకర విషయం!(AFP)

బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) సెంట్రల్ ఏరియాల్లో పరిస్థితిని మెరుగుపరచొచ్చు కానీ.. శివార్లలో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. 

(6 / 10)

బెంగళూరు వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు (బీడబ్ల్యూఎస్ఎస్బీ) సెంట్రల్ ఏరియాల్లో పరిస్థితిని మెరుగుపరచొచ్చు కానీ.. శివార్లలో నీటి సమస్య మరింత తీవ్రంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. (AFP)

తీవ్ర నీటి సంక్షోభం నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు చేపడుతున్నారు. 

(7 / 10)

తీవ్ర నీటి సంక్షోభం నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు చేపడుతున్నారు. (PTI)

"నీళ్లు ఏ వ్యక్తికీ చెందినవి కావు. ఇది ప్రతి ఒక్కరి కోసం. వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులందరూ ఒక పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. వాటర్ ట్యాంకర్లకు కామన్​గా ఒక ధరని నిర్ణయిస్తాం. నీటి సరఫరాకు రూ.556 కోట్లు కేటాయించాము" అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.  

(8 / 10)

"నీళ్లు ఏ వ్యక్తికీ చెందినవి కావు. ఇది ప్రతి ఒక్కరి కోసం. వార్ రూమ్ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులందరూ ఒక పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నిస్తారు. వాటర్ ట్యాంకర్లకు కామన్​గా ఒక ధరని నిర్ణయిస్తాం. నీటి సరఫరాకు రూ.556 కోట్లు కేటాయించాము" అని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు.  (PTI)

నగరానికి మార్చి నుంచి మే వరకు సుమారు 8 వేల మిలియన్ క్యూబిక్ ఫీట్ల (టీఎంసీ) నీరు అవసరమని అధికారులు చెబుతున్నా.. రిజర్వాయర్లలో 34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. 

(9 / 10)

నగరానికి మార్చి నుంచి మే వరకు సుమారు 8 వేల మిలియన్ క్యూబిక్ ఫీట్ల (టీఎంసీ) నీరు అవసరమని అధికారులు చెబుతున్నా.. రిజర్వాయర్లలో 34 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. (PTI)

భూగర్భ జల వనరులను నింపే ప్రయత్నంలో.. బెంగళూరులోని నగర పాలక సంస్థ అధికారులు ఎండిపోతున్న సరస్సులను రోజుకు 1,300 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన నీటితో నింపాలని నిర్ణయించారు. నగరంలోని సుమారు 50% బోరుబావులు ఎండిపోయినందున ఈ చర్యలు కీలకం.

(10 / 10)

భూగర్భ జల వనరులను నింపే ప్రయత్నంలో.. బెంగళూరులోని నగర పాలక సంస్థ అధికారులు ఎండిపోతున్న సరస్సులను రోజుకు 1,300 మిలియన్ లీటర్ల శుద్ధి చేసిన నీటితో నింపాలని నిర్ణయించారు. నగరంలోని సుమారు 50% బోరుబావులు ఎండిపోయినందున ఈ చర్యలు కీలకం.(PTI)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు