తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains: సికింద్రాబాద్, వికారాబాద్, కాకినాడకు స్పెషల్ ట్రైన్స్

SCR Special Trains: సికింద్రాబాద్, వికారాబాద్, కాకినాడకు స్పెషల్ ట్రైన్స్

HT Telugu Desk HT Telugu

05 October 2022, 12:04 IST

    • south central railway special trains: దసరా పండగ నేపథ్యంలో ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు ప్రత్యేక రైళ్ల వివరాలను ప్రకటించింది.
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు (HT)

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

South Central Railway Special Trains Latest: మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... దసరా పండగ నేపథ్యంలో తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. సికింద్రాబాద్ - నర్సాపూర్, నర్సాపూర్ - వికారాబాద్ మధ్య వీటిని నడపనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

secunderabad to narsapur: సికింద్రాబాద్ - నర్సాపూర్ మధ్య అక్టోబర్ 6వ తేదీన, నర్సాపూర్ - వికారాబాద్ మఝ్య అక్టోబర్ 7వ తేదీన స్పెషల్ ట్రైన్ నడపనున్నారు. సికింద్రాబాద్ - నర్సాపూర్ రైలు రాత్రి 10.35 నిమిషాలకు బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 10 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది. ఇది పెద్దపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనల్, విజయవాడ, గుడివాడ, అకివీడు, భీమవరం, పాలకొల్లు, నర్సాపూర్ స్టేషన్లలో ఆగుతుంది.

narsapur to vikarabad:నర్సాపూర్ - వికారాబాద్ ట్రైన్ రాత్రి 8 గంటలకు బయల్దేరి మరునాడు ఉదయం 10 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ఇది నర్సాపూర్, భీమవరం, అకివీడు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, పిడుగురాళ్లు, సికింద్రాబాద్, లింగపల్లి, వికారాబాద్ స్టేషన్లలో ఆగుతుందని అధికారులు ప్రకటించారు.

special trains between Secunderabad - Kakinada: మరోవైపు సికింద్రాబాద్ - కాకినాడ రూట్ లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 5,6 తేదీల్లో సికింద్రాబాద్ - కాకినాడ, కాకినాడ - సికింద్రాబాద్ రూట్ లో ఒక ట్రిప్ నడపనున్నారు. సికింద్రాబాద్ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరి... మరునాడు ఉదయం 04.30 నిమిషాలకు కాకినాడ టౌన్ కు చేరుకుంటుంది. ఇది పిడుగురాళ్లు, నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, కృష్ణా కెనాల్, విజయవాడ, ఎలూరు, తాడేపల్లిగూడం, నిడదవోలు, రాజమండ్రి, సామల్ కోట్, కాకినాడ టౌన్ స్టేషన్లలో ఆగుతుంది.