SCR Special Trains: గుడ్‌న్యూస్.. వేసవి దృష్ట్యా ఈ రూట్ లో మే 14 వరకు ప్రత్యేక రైళ్లు
27 April 2023, 13:47 IST
- South Central Railway Special Trains: వేసవిలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు తేదీలతో పాటు టైమింగ్స్ వివరాలను పేర్కొంది.
వేసవి ప్రత్యేక రైళ్లు
South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అప్డేట్ ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రవేశపెట్టగా... తాజాగా మరో రూట్ లో ప్రతిరోజూ సర్వీసులను నడపనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్ - సోలాపూర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. వేసవి రద్దీ దృష్ట్యా వీటిని నడుపుతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు వాటి వివరాలు చూస్తే….
హైదరాబాద్-సోలాపూర్(07003) రైలు ఉదయం 6 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి మధ్యాహ్నం 12.20 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఇక సోలాపూర్-హైదరాబాద్(07004) రైలు మధ్యాహ్నం 1.20 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు సోలాపూర్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, సెడమ్, వాడి, షహాబాద్, కలబుర్గి, గనగాపూర్ రోడ్, అకల్‌కోట్ రోడ్డు, తిలతి రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.
మే 14వ తేదీ వరకు రోజూ ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు. ఈ రైళ్లలో ఏసీ చైర్ కార్, సెకండ్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఓ ప్రకటనలో తెలిపారు.