SCR Holi Special Trains: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్ నుంచి హోలీ ప్రత్యేక రైళ్లు - వివరాలివే
01 March 2023, 14:42 IST
- South Central Railway Special Trains: హోళీ పండగ సమీపిస్తున్న వేళ ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. ఈ మేరకు పలు రూట్లలో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. తేదీలు, ట్రైమింగ్స్ వివరాలను పేర్కొంది.
హోలీ ప్రత్యేక రైళ్లు
South Central Railway Special Trains Latest: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. హోలీ పండగ కోసం సొంతూళ్లకు వెళ్లాలనుకుంటున్న వారి కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు ఉత్తరాది రాష్ట్రాలకు పలు రైళ్లను నడపనుంది. ఈ మేరకు వివరాలు చూస్తే....
హోలీ పండగ దృష్ట్యా... హైదరాబాద్ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడపనుంది దక్షిణ మధ్య రైల్వే. కాచిగూడ నుంచి బికనేర్, సికింద్రాబాద్ నుంచి రక్సౌల్ వరకు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మార్చి 4వ తేదీన సికింద్రాబాద్-రక్సౌల్ ( ట్రైన్ నెంబర్ 07051) ఎక్స్‌ప్రెస్ రైలు, రక్సౌల్-సికింద్రాబాద్ ( ట్రైన్ నెంబర్. 07052) రైలును మార్చి 9వ తేదీన నడపనుంది. ఇక మార్చి 4వ తేదీన కాచిగూడ-బికనేర్ (ట్రైన్ నెంబర్. 07053) ఎక్స్‌ప్రెస్ రైలును ప్రకటించింది. మార్చి 7వ తేదీన బికనేర్-కాచిగూడ (ట్రైన్ నెంబర్ - 07054) రైలును నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ హోలీ స్పెషల్ ట్రైన్స్ లో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్‌తో పాటు జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు కూడా ఉంటాయని ప్రకటించారు.
సమ్మర్ ట్రైన్స్.. వివరాలు
వేసవి దృష్ట్యా పలు రైళ్లను పొడిగించింది దక్షిణ మధ్య రైల్వే. తిరుపతి - అకోలా, అకోలా - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడిగించింది మార్చి 3 నుంచి మే 26వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఇక అకోలా - తిరుపతి రూట్ లో నడిచే రైలును కూడా... మార్చి 19 నుంచి మే 28వ తేదీ వరకు పొడిగించారు. తిరుపతి - పూర్ణ, పూర్ణ - తిరుపతి మధ్య ప్రవేశపెట్టిన స్పెషల్ ట్రైన్స్ ను కూడా మార్చి 3 నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు.
హైదరాబాద్ - నర్సాపూర్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును... మార్చి 18వ తేదీ నుంచి మే 27వ తేదీ వరకు పొడిగించగా... నర్సాపూర్ - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్ ను మార్చి 19వ తేదీ నుంచి మే 28 తేదీ వరకు పొడిగించారు. హైదరాబాద్ - తిరుపతి, తిరుపతి - హైదరాబాద్ మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ ను కూడా పొడిగించారు అధికారులు. మార్చి 30వ తేదీ నుంచి మే 30వ తేదీ వరకు నడపనున్నారు.విజయవాడ- నాగర్ సోల్, నాగర్ సోల్ - విజయవాడ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించారు.
కాకినాడ టౌన్- లింగపల్లి, లింగపల్లి - కాకినాడ టౌన్ మధ్య ఉన్న స్పెషల్ ట్రైన్స్ కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి 13వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు పొడిగించారు. మచిలీపట్నం- సికింద్రాబాద్, సికింద్రాబాద్ - మచిలీపట్నం రూట్ లో నడుస్తున్న ప్రత్యేక రైళ్లను కూడా పొడిగించారు. వీటిని మార్చి 19వ తేదీ నుంచి మే 28వ తేదీ వరకు పొడిగించారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్లను పొడగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మచిలీపట్నం - తిరుపతి, తిరుపతి మచిలీపట్నం మధ్య నడుస్తున్న స్పెషల్ ట్రైన్స్ ను పొడిగించారు. మార్చి 10వ తేదీ నుంచి జూన్ 1వ తేదీ వరకు ఈ రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సేవలను ప్రయాణికులు వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఓ ప్రకటనలో కోరారు.