తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hunter 350 : హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 విడుదల

Hunter 350 : హైదరాబాద్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 విడుదల

Anand Sai HT Telugu

24 August 2022, 19:24 IST

    • Royal Enfield Hunter 350 : బైక్ లవర్స్ కు రాయల్ ఎన్‌ఫీల్డ్ గుడ్ న్యూస్ చెప్పింది. హంటర్ 350 ఎప్పుడెప్పుడు ఇక్కడకు వస్తుందా అని ఎదురుచూసిన వారికి మంచివార్త అందింది. హైదరాబాద్‌ మార్కెట్లో తాజాగా విడుదల చేసింది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350

రాయల్ ఎన్‌ఫీల్డ్.. హంటర్ 350 బైక్‌ను ఇటీవలే మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే భాగ్యనగరంలో ఎప్పుడు విడుదల అవుతుందా అని చాలామంది బైక్ లవర్స్ ఎదురుచూశారు. తాజాగా వారికి గుడ్ న్యూస్ చెప్పింది రాయల్ ఎన్‌ఫీల్డ్. తన సరికొత్త హంటర్ 350ని ఆగస్టు 24న ఇక్కడ విడుదల చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Siddipet : సిద్దిపేటలో విషాదం, వడదెబ్బ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

Peddapalli Tractor Accident : పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు కూలీలు మృతి

TS AP Rains : తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు, రాబోయే నాలుగు రోజులు భారీ వర్షాలు-పిడుగుపాటు హెచ్చరికలు జారీ

Hyderabad Pub : యువతులతో అసభ్యకర డ్యాన్సులు, ఆఫ్టర్ 9 పబ్ పై పోలీసుల దాడులు

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 నగర వీధులు, ట్రాఫిక్ కు బాగా సరిపోయేలా డిజైన్ చేశారు. హంటర్ 350.., క్లాసిక్ 350 కంటే 14 కిలోలు తేలికైనది. J-సిరీస్ ఇంజిన్‌ను అందిస్తుంది. యూత్ ను టార్గెట్ చేసుకుని.. ఈ బైక్ ప్రారంభ ధర రూ. 1,49,900(ఎక్స్-షోరూమ్ తెలంగాణ) నిర్ణయించారు. రెండు రంగుల్లో హంటర్ 350 అందుబాటులో ఉంది. తెలంగాణలోని 75 రాయల్ ఎన్‌ఫీల్డ్ అవుట్‌లెట్లలో ఈ మోటార్‌సైకిల్ టెస్ట్ రైడ్‌లు, బుకింగ్‌లకు అందుబాటులో ఉంది. ఇప్పటికే బైక్ డెలివరీలు కూడా జరుగుతున్నాయి.

కస్టమర్లు వేచి ఉండాల్సిన అవసరం లేదని రాయల్ ఎన్‌ఫీల్డ్ చెబుతోంది. డెలివరీలు త్వరగా జరిగేలా చూసేందుకు తమ దగ్గర తగిన యూనిట్లు ఉన్నాయని అంటోంది. హంటర్ 350 రోడ్‌స్టర్ సెగ్మెంట్‌లో గణనీయమైన కస్టమర్ బేస్‌తో తెలంగాణలో కీలక వృద్ధి సాధిస్తుందని ఇండియా ప్లస్ సార్క్ బిజినెస్ మార్కెట్స్ హెడ్ జయప్రదీప్ అన్నారు.

'విస్తరణ ప్రణాళికలపై రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన బృందాలు కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌పై నిరంతరం పని చేస్తున్నాయి. మరిన్ని మోడళ్లను పరీక్షిస్తున్నాం. భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్లో మేం 6 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉన్నాం. రాయల్ ఎన్‌ఫీల్డ్‌ కొనుగోలు చేయాలనుకునేవారి దగ్గరకు హంటర్‌ మోడల్ ద్వారా వెళ్తున్నాం.' అని జయప్రదీప్ చెప్పారు.

అయితే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350ని రెట్రో, మెట్రో అనే రెండు వేరియంట్లను ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 రెట్రో వేరియంట్‌ రూ. 1,49,990గా ఉంది. డాపర్ సిరీస్ మెట్రో వేరియంట్‌ రూ. 1,63,900గా నిర్ధారించారు. రెబెల్ సిరీస్ మెట్రో వేరియంట్‌ రూ. 1,68,900 ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరగా ఉంది. రూ. 1.49 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధరతో హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి చౌకైన బైక్‌గా మార్కెట్‌లోకి వచ్చింది.